ముందు రోజు రాత్రే ఓజి ప్రీమియర్లు చూసి సంబరాలను అంబరాన్ని తాకేలా చేసుకుందామని ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేలేలా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజి స్పెషల్ నైట్ షోలు ఉండకపోవచ్చు. సెప్టెంబర్ 25 తెల్లవారుఝాము 1 గంట లేదా 4 గంటల నుంచి స్క్రీనింగ్స్ మొదలుపెట్టొచ్చట. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు అనఫీషియల్ ఇన్ఫో వచ్చిందని టాక్. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఇప్పటిదాకా దీని గురించి స్పందించలేదు. అనుమతులు, టికెట్ రేట్ల పెంపు తాలూకు జిఓలు వచ్చే దాకా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ న్యూస్ ఉండవు.
పక్కాగా ప్రీమియర్లు ఉంటాయనే నమ్మకంతో ఫ్యాన్స్ బోలెడు ప్లాన్లు వేసుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని ఒక సింగల్ స్క్రీన్ కోసం ఏకంగా ఒక టన్ను పేపర్ కటింగ్స్ సిద్ధం చేసుకున్నారంటే ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటి మొదటి టికెట్ అమ్మకాలు వేలం వేసి మరీ లక్ష రూపాయలకు అమ్మిన ఉదంతాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒకవేళ షోలు లేకపోతే పాడుకున్న వాళ్ళకు గుండెపోటే. కాకపోతే జనసేన విరాళం కోసం కాబట్టి అదేమంత సమస్య కాదు కానీ అసలు ఎప్పటి నుంచి షోలు స్టార్ట్ అవుతాయనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓజికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సెన్సేషన్ గా నిలుస్తోంది. ఓపెనింగ్స్ ఏఏ రికార్డులను బద్దలు బద్దలుకొడతాయో ఊహకు అందడం లేదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రపంచానికి ఓజితో తెలుస్తుందని ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. దర్శకుడు సుజిత్ వదులుతున్న కంటెంట్ దానికి తగ్గట్టే ఉండగా తమన్ పాటలు హైప్ ని అంతకంతా పెంచుతున్నాయి. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, డేట్ గురించి ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి. విజయవాడ లేదా హైదరాబాద్ ఏదో ఒకటి ఫిక్స్ అవ్వొచ్చు.
This post was last modified on September 16, 2025 1:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…