90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె అప్పటి టాప్ స్టార్లందరితోనూ సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. కెరీర్లో బిజీగా ఉండగానే ఆమె విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. వీరికి ఓ అమ్మాయి పుట్టింది. తన పేరు.. నైనిక. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘తెరి’లో ఆ పాప కీలక పాత్ర పోషించింది.
ఐతే మూడేళ్ల కిందట మీనా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఐతే భర్త చనిపోయిన కొన్ని రోజులకే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత కూడా అవి కొనసాగడం తనకు తీవ్ర మనోవేదన కలిగించినట్లు మీనా చెప్పారు. జీ తెలుగు కోసం సీనియర్ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోల ో పాల్గొన్న మీనా.. ఈ విషయమై మాట్లాడారు.
‘‘నేను నటిగా బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా. ఐతే దురదృష్టవశాత్తూ నా భర్త 2022లో చనిపోయారు. ఆయన చనిపోయిన వారానికే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో రాశారు. వాళ్లకు కుటుంబాలు ఉండవా, ఇలా రాస్తున్నారేంటి అని చాలా బాధ పడ్డాను. ఆ తర్వాత ఏ నటుడు విడాకులు తీసుకున్నా.. నాతో పెళ్లి అని రాసేవారు. అలాంటి వార్తలు చూసి అసహ్యం పుట్టింది’’ అని మీనా ఆవేదనగా మాట్లాడారు.
తన కెరీర్ ఆరంభంలో నిర్మాతల కష్టం చూసి చాలా తక్కువ పారితోషకాలకు సినిమాలు చేశానని.. కానీ ఆ సినిమాలు పెద్ద హిట్టయినా తనను పట్టించుకునేవారు కాదని మీనా చెప్పింది. తన పాప పుట్టిన రెండేళ్లకు మోహన్ లాల్ మలయాళ సినిమా ‘దృశ్యం’ కోసం అడిగారని.. పాప కోసం తాను చేయలేనని చెప్పానని.. కానీ తనను దృష్టిలో ఉంచుకునే ఆ క్యారెక్టర్ రాశామని.. ఇంకెవరితోనూ ఆ సినిమా చేయమని చెప్పడంతో అందులో నటించాల్సి వచ్చిందని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో తనకు అది పెద్ద బ్రేక్ ఇచ్చిందని మీనా చెప్పింది.
This post was last modified on September 15, 2025 10:22 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…