కొందరు నటులు పెద్ద పెద్ద పాత్రలు చేయకపోయినా.. చిన్న చిన్న క్యారెక్టర్లతోనే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పావలా శ్యామల అలాంటి నటే. ఆమె వందల సినిమాల్లో నటించారు కానీ.. అన్నీ చిన్న చిన్న పాత్రలే. ఆంధ్రావాలా, గోలీమార్, మత్తు వదలరా లాంటి చిత్రాల్లో శ్యామల పంచిన వినోదాన్ని ప్రేక్షకులు మరిచిపోలేరు. ఐతే చేసినవన్నీ చిన్న పాత్రలే కావడంతో పెద్దగా సంపాదించుకోలేదు.
పైగా అనారోగ్యం పాలవడంతో డబ్బులు బాగా ఖర్చయిపోయి దీన స్థితికి చేరుకుంది. కొన్నేళ్ల ముందు పవన్ కళ్యాణ్‌కు విషయం తెలిసి ఆర్థిక సాయం అందజేశారు. ఇండస్ట్రీలో కూడా మరికొందరు శ్యామలను ఆదుకున్నారు. కానీ తర్వాత అందరూ ఆమెను మరిచిపోయారు. శ్యామల కూతురు సైతం అనారోగ్యం పాలవడంతో వారి పరిస్థితి ఇంకా దుర్భరంగా తయారైంది.
శ్యామలతో పాటు ఆమె కూతురు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకే చోట చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలియడంతో ఆయన టీం ఆమెను చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల, ఆమె కూతురిని బన్నీ టీం మెంబర్ కలిసి.. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
వారికి ఇకపై ఇబ్బంది రాకుండా నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చేలా ఏర్పాటు చేశాడట బన్నీ. చికిత్సకు కూడా తాత్కాలికంగా కొంత సాయం అందజేసినట్లు సమాచారం.
తన సినిమా ‘పుష్ప-2’ రిలీజైనపుడు జరిగిన తొక్కిసలాటలో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న శ్రీతేజ్ కోసం కోట్లల్లో ఖర్చు చేశాడు బన్నీ. ఇంకా ఆ సాయం కొనసాగుతూనే ఉంది. బన్నీ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. దీనికి తోడు ఇప్పుడు శ్యామల కోసం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం ప్రశంసలు అందుకుంటోంది.
This post was last modified on March 5, 2026 2:39 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…