Movie News

పవన్ సినిమా అంటే వర్షాలేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏదో ఒక అడ్డంకి ఎదురు కావడం కామన్ అయిపోయింది. పవన్ ప్రతిపక్షంలో ఉండగా రిలీజైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలకు టికెట్ల ధరల విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిసిందే. ఇక గత ఏడాది ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ ముంగిట చాలా అడ్డంకులే దాటాల్సి వచ్చింది. ఫైనాన్స్, బిజినెస్ సమస్యలకు తోడు.. వర్షాలు కూడా ఆ చిత్రానికి తీవ్ర ఇబ్బంది కలిగించాయి.

పీక్ రెయినీ సీజన్లో రిలీజైన ఆ చిత్రం మీద వర్షాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. తర్వాత సెప్టెంబరులో ‘ఓజీ’ విడుదలైతే.. అప్పుడు కూడా వర్షం బెడద తప్పలేదు. అప్పటికి వర్షాకాలం పూర్తి కావాలి కానీ.. గత ఏఢాది వానలు సుదీర్ఘ కాలం పడడంతో ‘ఓజీ’కి కొంత ఇబ్బంది తప్పలేదు. ఐతే పవన్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు వాతావరణ పరంగా ఏ ఇబ్బందీ ఉండదని అనుకుంటే.. షాక్ తప్పేలా లేదు.

మార్చిలో వర్షాల జాడే ఉండదు మామూలుగా. కానీ ఈసారి మాత్రం ఈ నెల మూడో వారంలో అకాల వర్షాలు పడబోతున్నాయి. ఫిబ్రవరిలో రెండు మూడు రోజులు హైదరాబాద్‌ సహా తెలంగాణలో అకాల వర్షాలు పడి జనం ఇబ్బంది పడ్డారు. కొంచెం బ్రేక్ తర్వాత మార్చి 18, 19 తేదీల్లో భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

17వ తేదీ వరకు వాతావరణం పొడిగానే ఉంటుందట. కానీ తర్వాతి రెండు రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది.
‘ఉస్తాద్..’కు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయాలని చూస్తున్నారు. ఆ రోజే కాక.. రిలీజ్ డే కూడా అకాల వర్షాల వల్ల తెలంగాణలో ‘ఉస్తాద్..’ షోలకు ఇబ్బంది తప్పకపోవచ్చు.

సమ్మర్ సీజన్లో పవన్ సినిమాను రిలీజ్ చేస్తున్నా ఇలా వర్షాల బెడద తప్పకపోవడం విడ్డూరమే. మార్చి 26కు అనుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను వారం ముందుకు జరిపి మార్చి 19న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించిన వెంటనే ఈ అకాల వర్షాల అప్‌డేట్ బయటికి రావడం గమనార్హం.

This post was last modified on March 5, 2026 2:28 pm

Share

Recent Posts

మళ్లీ శింబు-నయన్ జోడీ… నమ్మొచ్చా?

తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…

7 hours ago

టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో తెలుగు నేతలు

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…

7 hours ago

జ‌గ‌న్ ఆశ తీరుతుందా?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులి వెందుల‌లో ఆదివారం హ‌ల్చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

తమన్ గమనిస్తున్నాడా?

తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు తమన్. వేరే భాషల్లోనూ తరచుగా సినిమాలు చేస్తున్నాడు. తన…

8 hours ago

రాప్తాడు స్కూల్ దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు

రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు హేమంత్‌పై పోలీసులు…

8 hours ago

‘ఆదర్శ కుటుంబం’పై ‘జిమ్ జిమ్ తార’ లక్ష్మి ఫైర్

సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు హీరోలవుతారో, జీరోలవుతారో చెప్పలేం. అనుకోకుండా పాపులారిటీ సంపాదించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతుంటారు…

10 hours ago