Political News

పాడిన పాటే పాడుతోన్న అంబటి

సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు కేసుల్లో పీటీ వారెంట్ పై రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్న అంబటి…కోర్టుకు హాజరయ్యే సమయంలో తగ్గేదేలే అంటూ పుష్ప మాదిరి మేనరిజంతో చెప్పడం చర్చనీయాంశమైంది.

జైలుకు వెళ్లినా భయపడేదే లేదని అంబటి ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే పాట పాడుతూ జైలుకు వెళ్లేందుకు భయపడితే రాజకీయాలు చేయలేమంటూ అంబటి చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.

రాజమండ్రి జైలు నుంచి వచ్చేటప్పుడే వెళ్లొస్తానని అక్కడి సిబ్బందితో చెప్పానని అంబటి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనను జైల్లో మినిమం నెల…మ్యాగ్జిమమ్ 3 నెలలు ఉంచుతారని ఫిక్సయ్యానని అంబటి అన్నారు.

అయితే, జైలుకు వెళ్లి వచ్చినా అంబటి పొగరు తగ్గలేదని లోకేశ్ అనుకుంటున్నారని, ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. అందుకే, జైలు సిబ్బందికి మళ్లీ వస్తానని, లోకేశ్ తనను మళ్లీ జైలుకు పంపుతారని చెప్పే వచ్చానని తెలిపారు.

అయితే, జైలు నుండి విడుదలై 20 రోజులైనా ఆ టాపిక్ ను మాత్రం అంబటి, వైసీపీ నేతలు వదలడం లేదు. ఎవరో ఒక వైసీపీ నేత అంబటిని 2-3 రోజులకోసారి పరామర్శించడం, ప్రెస్మీట్ పెట్టి ఆ అరెస్టు గురించి మాట్లాడి ఆ టాపిక్ సద్దుమణగకుండా చూడడం పరిపాటిగా మారింది.

ఓ పక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గాలికొదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు…అంబటికి సంఘీభావంగా తరలిరావడంపై విమర్శలు వస్తున్నాయి. అంబటి అరెస్టుపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై పెడితే బాగుంటుందని, అలా కాకుండా పదే పదే పాత పాట పాడితే ఏం లాభం అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అరెస్టుపై అంబటి డైలీ సీరియల్ కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో అని సెటైర్లు వేస్తున్నారు.

This post was last modified on March 5, 2026 4:37 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

7 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago