అజిత్ కూతురు హీరోయిన్ అయిందంటే… సొంత కూతురేమో అని పొరబడకండి. ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాల్లో అజిత్ కుమార్ కూతురి పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ త్వరలోనే హీరోయిన్‍గా పరిచయం అవుతోంది. మలయాళంలో పలు చిత్రాల్లో బాల నటిగా నటించి చాలా అవార్డులు కూడా గెలుచుకున్న అనిఖ ఇటీవల ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్‍లో యుక్త వయసులో జయలలిత పాత్రను పోషించింది. ఆమె ఇప్పుడో తెలుగు సినిమాతో హీరోయిన్‍గా వస్తోంది.
మలయాళంలో హిట్టయిన కపేల చిత్రం ఆధారంగా సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ తెలుగులో రూపొందించే రీమేక్‍లో అనిఖ హీరోయిన్‍గా నటించనుంది. ఈ పాత్ర కోసం ఉప్పెన హీరోయిన్ కృతి షెట్టిని సంప్రదించారు కానీ ఆమె మరీ డెబ్బయ్ లక్షలు డిమాండ్ చేయడంతో అనిఖను ఎంచుకున్నారు. పదహారేళ్ల లేత ప్రాయమే అయినా కానీ ఆ కథలోని హీరోయిన్ కూడా అదే వయసు అమ్మాయి కనుక అనిఖ మంచి ఆప్షనే అనుకోవాలి. ఈ చిత్రంలో ఒక హీరోగా నవీన్ చంద్ర ఎంపికయ్యాడట. మరో పాత్ర ఎవరు చేసేదీ ఇంకా ఖరారు కాలేదు. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates