తన పాత్ర పెర్ఫార్మన్స్ డిమాండ్ చేస్తే తప్ప అంత ఈజీగా ఏ సినిమా ఒప్పుకోని సాయిపల్లవి తండేల్ తర్వాత మళ్ళీ తెరమీద కనిపించలేదు. గత ఏడాది అమరన్ రూపంలో బ్లాక్ బస్టర్ దక్కినా కూడా స్పీడ్ పెంచలేదు. ప్రస్తుతం తన ధ్యాసంతా రామాయణ మీదే ఉంది. నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తీసినట్టుగా నిర్మాత చెబుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ద్వారా తనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఫిదా భానుమతి ఉంది. మొదటి భాగం వచ్చే ఏడాది, పార్ట్ టూ 2027లో విడుదల కాబోతున్న రామాయణ మన ఇతిహాసమే అయినప్పటికీ ప్రపంచ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని రూపొందుతోంది.
ఇంత పెద్ద గ్రాండియర్ లో భాగమైనప్పుడు తర్వాతి లైనప్ మరింత ప్రత్యేకంగా ఉండాలి. చెన్నై టాక్ ప్రకారం సాయిపల్లవి దగ్గరికి శింబు 49 ఆఫర్ వచ్చిందట. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందబోయే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కథలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందట. గ్లామర్ ఉన్న వాళ్ళు కాకుండా నటన బెస్ట్ ఇచ్చే వాళ్ళైతేనే న్యాయం చేయగలరని భావించి వెట్రిమారన్ ఈమెను సంప్రదించినట్టు కోలీవుడ్ కథనం. అయితే ఇదే సినిమాకు పూజా హెగ్డేని అడిగారనే వార్త ఈ మధ్యే వచ్చింది. రెట్రోలో ఆమె నటన చూసి తనైతే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచన చేసినట్టు సమాచారం.
ఇది పక్కన పెడితే సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ విడుదలకు సిద్ధంగా ఉంది. జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ని ఆమె ఎందుకు ఒప్పుకుందనే ప్రశ్న ఫ్యాన్స్ లో ఇప్పటికీ ఉంది. రిలీజ్ డేట్ విషయంలో జరుగుతున్న ఆలస్యం పలు అనుమానాలు లేవనెత్తుతోంది. జానర్ ప్రేమకు సంబంధించినదే అయినా చాలా డిఫరెంట్ పాయింట్ తో ఏక్ దిన్ రూపొందిందట. అయినా రామాయణ లాంటి మూవీ చేతిలో పెట్టుకుని ఇప్పుడు వెట్రిమారన్ కు సాయిపల్లవి ఓకే చెబుతుందా అనేది డౌట్ గానే ఉంది. ఇవి కాకుండా తను వింటున్న కథలు, ఒప్పుకున్న సినిమాలు ఏవీ లేకపోవడం గమనార్హం.
This post was last modified on September 13, 2025 11:52 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…