గత కొన్నేళ్లుగా సినిమాల సక్సెస్ రేట్ తగ్గుతూ వస్తోంది. థియేటర్ల పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. అందుకు కారణాలు అనేకం. ఈ ఏడాది అయితే బాక్సాఫీస్ మరీ డల్లుగా మారిపోవడంతో ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమైంది. క్రేజీ సీజన్ అయిన సమ్మర్ పెద్ద సిమాలు లేక కళ తప్పింది. ఆ తర్వాత ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ, వార్-2.. ఇవన్నీ ప్రేక్షకులకు షాకులే ఇచ్చాయి. దీంతో బాక్సాఫీస్ మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమయ్యాయి. ఐతే సెప్టెంబరు నెల పాజిటివ్ నోట్‌తో మొదలైంది.
తొలి వారంలో ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా సంచలనం రేపింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ నంబర్లతో తొలి వారంలో ఈ సినిమా దూసుకెళ్లింది. ఇంకో రెండు వారాలు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చేలా ఉన్నాయి. ఇక ఈ వారం రిలీజవుతున్న రెండు సినిమాలూ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. ‘మిరాయ్’ అయితే స్టార్ హీరోల సినిమాల స్థాయిలో హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో కూడా అంతర్గతంగా చాలా పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు.
తేజ సజ్జ చివరి చిత్రం ‘హనుమాన్’ లాగే పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న సినిమా అంటున్నారు. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఇక ఈ వీకెండ్ రాబోతున్న మరో చిత్రం ‘కిష్కింధపురి’కి కొంచెం లేటుగా బజ్ క్రియేట్ అయింది. రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయగా.. దానికి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఎవ్వరూ సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడట్లేదు. ‘రాక్షసుడు’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌కు మరో హిట్ పడ్డట్లే అంటున్నారు. నిర్మాత చాలా ధీమాగా గురువారం కూడా పెద్ద సంఖ్యలో ప్రిమియర్స్ ప్లాన్ చేశాడు. ఈ రెండు చిత్రాలకూ పాజిటివ్ టాక్ వస్తే రెండు వారాల వరకు బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఆ తర్వాత ఎలాగూ ‘ఓజీ’ సందడి ఉంటుంది.
This post was last modified on September 11, 2025 9:59 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…