ఇంకో రెండు వారాల్లో ఓజి వచ్చేస్తున్నాడు. ప్రస్తుతానికి సౌండ్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నప్పటికీ రిలీజ్ రోజు నాటికి ఏర్పడే వాతావరణం ఊహించుకోవడం కూడా కష్టమే. నెలలు, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం వస్తుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ చర్చలు ప్రధానంగా రెండు విషయాల మీద జరుగుతున్నాయి. వాటిలో మొదటిది టికెట్ రేట్లు. ఏపీ తెలంగాణలో పెంచుకునే వెసులుబాటు చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి డివివి ఎంటర్ టైన్మెంట్స్ దాన్ని వాడుకోకుండా ఉండదు.
అదే జరిగితే గరిష్టంగా వంద రూపాయల నుంచి నూటా యాభై రూపాయల మధ్యలో ప్రతి టికెట్ మీద పెంపు అడగొచ్చు. ఏపీలో పర్మిషన్లు ఈజీనే కానీ తెలంగాణలో ఇప్పటికే ఉన్న గరిష్ట మల్టీప్లెక్స్ ధర 295 మీద ఇంకెంత హైక్ ఇస్తారనేది సస్పెన్స్ గా నిలిచింది. డివివి టీమ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కనిష్టంగా వందకు పైనే హైక్ ఆశిస్తోందని ఇన్ సైడ్ టాక్. ఇక రెండో అంశం ప్రీమియర్లు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి షోలు వేయాలని అప్పుడే డిస్ట్రిబ్యూటర్ల మీద అభిమాన సంఘాలు ఒత్తిడి పెడుతున్నాయట. హరిహర వీరమల్లుకే 600 రూపాయలు పెట్టినప్పుడు ఓజికి ఎంత డిసైడ్ చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం.
ఇప్పటిదాకా హయ్యెస్ట్ ప్రీమియర్ టికెట్ రేట్ రికార్డు పుష్ప 2 ది రూల్ మీద ఉంది. 800 రూపాయల నుంచి 1000 మధ్యలో పెట్టి ముందు రోజే సెకండ్ షోలు వేయడం ద్వారా మైత్రి కొత్త స్ట్రాటజీకి తెరతీసింది. మరి ఇప్పుడు ఓజి దానికి ఏ మాత్రం తీసిపోని బజ్ తో క్రేజ్ సంపాదించుకుంది. కాకపోతే పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మరీ ఎక్కువ పెంపు ఇచ్చినా ప్రతిపక్షాలకు ఆయుధం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీమియర్ రేట్ ఎంత పెట్టినా బయట బ్లాక్ లో మాత్రం కనిష్టంగా వెయ్యి నుంచి అయిదు వేల దాకా పలుకుతుందని ఫ్యాన్స్ ముందస్తు అంచనా వేస్తున్నారు. నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on September 11, 2025 6:12 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…