Movie News

బన్నీ వాస్ చెప్పిన భలే నిజం

లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ ఒక భలే నిజం చెప్పారు. ఇప్పుడీ సినిమా చూసి యూత్ చిత్రాలు మళ్ళీ విరగదీస్తున్నాయని పదే పదే ఇలాంటి ప్రయత్నాలు తొందరపడి చేస్తే కాళ్ళు విరగొట్టుకోవడం ఖాయమని నేరుగా స్టేజి మీదే చెప్పేశారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒక జానర్ లేదా సబ్జెక్టుకి సంబంధించిన సినిమా హిట్ అయితే చాలు అదే కోవలో పదులు వందల సంఖ్యలో తీస్తూనే పోతారు. చిత్రం వచ్చినప్పుడు ఇదే జరిగింది. జాతిరత్నాలు టైంలోనూ ఇలాంటివి చూశాం. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వంతు వచ్చింది. అందుకే బన్నీ వాస్ ముందస్తుగా హెచ్చరిక చేశారు.

ప్రాక్టికల్ గా చూస్తే లిటిల్ హార్ట్స్ కూడా ఈటివి విన్, ఆదిత్య హాసన్, బన్నీ వాస్, వంశి నందిపాటి లాంటి బ్రాండెడ్ చేతులు అండగా నిలబడ్డాయి కాబట్టి థియేటర్ రిలీజ్ ఈజీ అయ్యింది. ప్రమోషన్లకు కోటిన్నర ఖర్చు పెట్టడం చిన్న నిర్మాతల వల్ల కాదు. ఇంత పుష్ చేసి డిస్ట్రిబ్యూషన్ రూపంలో అండగా నిలబడ్డారు కాబట్టి లిటిల్ హార్ట్స్ ఎక్కువ శాతం జనాలకు రీచ్ అయ్యింది. కానీ అలా అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా రెండు మూడు కోట్లలో సినిమా తీసి బయ్యర్లు లేక, థియేటర్ అగ్రిమెంట్లకు డబ్బులు లేక, పబ్లిసిటీ కోసం చేయూతనిచ్చే అండ కోసం ఎదురు చూస్తున్న చోటా ప్రొడ్యూసర్లు చాలానే ఉన్నారు.

సో లిటిల్ హార్ట్స్ విజయంలో కీలక భూమిక పోషించిన బన్నీ వాస్ చెప్పినదాంట్లో వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనే అన్నట్టు ఫైనల్ గా గెలిచేది కంటెంటే. అది ఆడియన్స్ మెచ్చుకునేలా ఎలా ఇస్తామనేది ఇక్కడ కీలకం. అంతే తప్ప చేతిలో బడ్జెట్ ఉన్నంత మాత్రనా థియేటర్లలో సినిమాలు ఆడవు. ఓటిటిలు పరిగెత్తుకుంటూ వచ్చి వీటిని కొనరు. లిటిల్ హార్ట్స్ సక్సెస్ చూసి కొందరు ఇంటర్ అమ్మాయి అబ్బాయి ప్రేమకథలను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న మాట నిజం. అది వినే బన్నీ వాస్ బహుశా హింట్ ఇచ్చారేమో. ఏది ఏమైనా ఇంత పెద్ద విజయం సాధించడంతో లిటిల్ హార్ట్స్ టీమ్ ఆనందం మాములుగా లేదు.

This post was last modified on September 11, 2025 2:55 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

14 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

2 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

2 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago