ఇండస్ట్రీలో అంతే. ఒకే ఒక్క సినిమా రాత్రికి రాత్రి జాతకాలను మార్చేస్తుంది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివ అలా నిలిచిపోయినవే. కాకపోతే హీరోయిన్లకు ఇలాంటి బ్రేక్స్ దొరకడం కష్టం. విజయశాంతికి కర్తవ్యం లాగా ప్రతి ఒక్కరికి అవి సాధ్యం కావు. కానీ కళ్యాణి ప్రియదర్శన్ సుడి బాగుంది. ఇటీవలే విడుదలైన కొత్త లోక చాప్టర్ 1తో ఏకంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో తన స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. లోకకు సంబంధించి లీడ్ రోల్ తనదే కావడంతో హీరో నస్లీన్ ఎక్కువసేపు కనిపించినా కూడా ఆమె స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. అలా కళ్యాణికి దశ తిరుగుతోందన్న మాట.
తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ సరైన బ్రేక్ కోసం చాలానే ఎదురు చూసింది. తెలుగులో డెబ్యూ చేసిన హలో పోయినా చిత్రలహరి మంచి హిట్ గానే నిలిచింది. కానీ రణరంగం డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ వైపుకు రాలేదు. మలయాళం, తమిళం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా ఈ అమ్మాయికి పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప మార్కులు పడేవి కాదు. హృదయం, తాలుమాల నుంచి తనలో నటిని బయటికి తీసుకురావడం మొదలుపెట్టింది. లోకలోనూ కథ డిమాండ్ మేరకు సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఎక్కువ పెట్టింది కానీ యాక్టింగ్ పరంగా మెరుగయ్యిందనేది వాస్తవం.
కూతురు సక్సెస్ పట్ల తండ్రి ప్రియదర్శన్ చాలా సంతోషంగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడిగా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈయన ఇప్పుడు కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు. 90 దశకంలో నాగార్జున నిర్ణయం, బాలకృష్ణ గాండీవం తీశారు కానీ ఆ రెండూ ఆశించిన అంచనాలు అందుకోలేకపోయాయి. తర్వాత మళ్ళీ ఇటువైపు రాలేదు. కళ్యాణి తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయితే ప్రియదర్శన్ కూడా రెండింటికే పరిమితం కావడం గమనించాల్సిన విషయం. కళ్యాణి ప్రస్తుతం రవి మోహన్ తో చేసిన ఫాంటసీ మూవీ జీనీ త్వరలో విడుదలకు రెడీ అవుతుండగా కార్తీ మార్షల్ నిర్మాణంలో ఉంది.
This post was last modified on September 11, 2025 11:55 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…