Movie News

అనుష్క ఏదో ఒకటి తేల్చేయాలి

తాను బయట కనిపించకపోయినా పర్లేదు తెరమీద దర్శనమిస్తే చాలు టికెట్లు కొనే జనాలున్నారన్న అనుష్క అంచనాలను ఘాటీ పూర్తిగా మాయం చేసింది. వచ్చిన కాసిన్ని ఓపెనింగ్స్ ఆమె ఖాతాలోకే వేసినా అవి కూడా మరీ తీసికట్టుగా ఉండటం ఆలోచించాల్సిన విషయం. ఆచార్య, ఆఫీసర్, రూలర్ లాంటి డిజాస్టర్లతో పోలుస్తున్నారంటే సినిమా ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆడియో రూపంలో స్వీటీ చేసిన పబ్లిసిటీ వల్ల ఏ ఉపయోగం కలగలేదు. ఇప్పుడు తన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మలయాళంలో తీసిన కథనర్. ఇది పీరియాడిక్ డ్రామా. తెలుగులోనూ డబ్బింగ్ చేసి సమాంతరంగా వదులుతారు.

ఇక అనుష్క ఏదో ఒకటి తేల్చుకునే టైం అయితే వచ్చేసింది. సినిమాలు కొనసాగించాలంటే స్పీడ్ పెంచాలి. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం తన వ్యక్తిగత విషయం. ఆ మాటకొస్తే త్రిష లాంటి వాళ్ళు కూడా ఈ క్లబ్బులో ఉన్నారు. ఇప్పటికీ చేతి నిండా నాలుగైదు సినిమాలతో ఆమె బిజీగా ఉంది. కానీ అనుష్క సంగతి వేరు. మీడియా కెమెరాల ముందుకు రావడం లేదు. తన రూపం కోసం ఆలా చేస్తోందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియలేదు, ఇకపై తన దగ్గరికి వచ్చే కథలు, దర్శకులను వెయిట్ చేయించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే కెరీర్ బాగుటుంది.

ఘాటీలో అనుష్క మరీ బ్యాడ్ గా అనిపించలేదు. కొంచెం బొద్దుగా ఉన్నా చూడబుల్ గా ఉంది. కొన్ని సీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసింది కూడా. అలాంటప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా పాత స్థాయిలో ఆదరణ దక్కించుకునే వెసులుబాటు హీరోయిన్లకు ఉండదు. ఎనిమిదేళ్లు మేకప్ కి దూరంగా ఉన్నా చిరంజీవిని ఆదరించిన జనం విజయశాంతిని అదే స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. సో కంటిన్యూటీ చాలా అవసరం. మరి అనుష్క కనక ఫిల్మోగ్రఫీ పెంచుకునే ఉద్దేశంలో ఉంటే మాత్రం యువి క్రియేషన్స్ కాకుండా బయట సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.

This post was last modified on September 10, 2025 3:03 pm

Share

Recent Posts

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

3 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

10 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

10 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

11 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

13 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

13 hours ago