కాదేది బయోపిక్కుకి అనర్హం అన్నట్టుంది ట్రెండ్. స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు, సినిమా తారలు ఇలా వీళ్ళ కథలు చూసి చూసి బోర్ కొట్టిందేమో దర్శకుడు టీజె జ్ఞానవేల్ కొత్త ఆలోచన చేస్తున్నారు. తమిళనాడులో దోశె కింగ్ గా ప్రసిద్ధి పొందిన శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని లాలెట్టాన్ మోహన్ లాల్ ని దాదాపుగా ఒప్పించారని సమాచారం. అయితే ఈయన జీవితంలో ఎన్నో గొప్ప ఎత్తులకు చేరుకున్నాడు కానీ దానికి సమానమైన నేర చరిత్ర కూడా ఉంది. అదే ఈ కథలో కీలకం కానుంది.
తమిళనాడులోని మారుమూల పల్లెకు చెందిన రాజగోపాల్ పెద్దగా చదువుకోలేదు. కిరాణా కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి 1981లో చిన్న హోటల్ ప్రారంభించాడు. దోసెలు మహా రుచిగా వేయడంతో తక్కువ టైంలోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఓపెన్ చేసి వేల నుంచి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఒక జ్యోతిష్యుడి సలహా మేరకు అసిస్టెంట్ మేనేజర్ కూతురైన జీవజ్యోతిని పెళ్లాడాలని తెగ ప్రయత్నించాడు. కానీ ఆమెకు అప్పటికే శాంత కుమార్ అనే వ్యక్తితో పెళ్ళైపోయి ఉంటుంది. 2001లో శరత్ మృతదేహం ఒక అడవిలో దొరికింది. రాజగోపాల్ మీద కిడ్నాప్, హత్యకేసు నమోదయ్యింది.
నేరం ఋజువు కావడంతో 2010లో రాజగోపాల్ కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. 2019లో సుప్రీమ్ కోర్టు దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చింది. అదే సంవత్సరం కోర్టుకు వచ్చి లొంగిపోయే క్రమంలో రాజగోపాల్ గుండెపోటుతో చనిపోయారు. ఒక ఆడదాన్ని ఇష్టపడటం వల్ల ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేసుకున్న ఇతని జీవితం మీద ఎన్నో కథనాలు వచ్చాయి. వెట్టయన్, జై భీంతో పేరు తెచ్చుకున్న టీజె జ్ఞానవేల్ మరి రాజగోపాల్ ని పాజిటివ్ గా చూపిస్తారా లేక ఉన్నద్ధున్నట్టు ప్రెజెంట్ చేస్తారో చూడాలి. మోహన్ లాల్ అయితే సానుకూలంగా స్పందించినట్టు చెన్నై అప్డేట్.
This post was last modified on September 8, 2025 2:37 pm
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…