పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డ్యాన్స్ మీద పెద్దగా ఫోకస్ ఉన్నట్లు కనిపించదు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి లాగా పవన్ వీర లెవెల్లో ఏమీ స్టెప్పులేయడు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి చిత్రాల్లో డ్యాన్సులు బాగానే వేసినా.. తర్వాత తర్వాత పవన్ డ్యాన్సుల మీద పెద్దగా దృష్టిపెట్టింది లేదు. చివరగా ఆయన కొంచెం గట్టిగా డ్యాన్సులేసింది అంటే.. ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనే. ఆ తర్వాత ఆయన చిత్రాల్లో పెద్దగా డ్యాన్స్ నంబర్స్ కూడా కనిపించవు. ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇచ్చాక అయితే పవన్ డ్యాన్సుల గురించి మాట్లాడుకోవడానికి అసలేమీ లేనట్లే. ఐతే పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో మాత్రం కొంచెం గట్టిగానే డ్యాన్సులుంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే పవన్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన పోస్టర్ అందుకు నిదర్శనం. అందులో మైకేల్ జాక్సన్‌ను గుర్తుకు తెచ్చే పోజు ఇచ్చాడు పవన్. ఈ పాటలో పవన్ డ్యాన్సులతో అదరగొట్టేయబోతున్నాడనే హింట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇచ్చేశాడు. తనకు చాన్నాళ్ల తర్వాత డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం తెప్పించావంటూ స్వయంగా పవన్.. దేవిని అభినందించాడట. దుబాయ్‌లో సైమా సినీ అవార్డుల వేడుక సందర్భంగా ఆ విషయాన్ని దేవినే స్వయంగా వెల్లడించాడు.
పవన్ కళ్యాణ్‌తో చాన్నాళ్ల తర్వాత కలిసి పని చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అప్‌డేట్స్ గురించి దేవిని అడిగితే.. ‘‘ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా ‘ఈసారి పెర్ఫామెన్స్ బద్దలైపోతుంది’ అని.. అలాగే ఉంటుంది సినిమా. ఇటీవలే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ఒక పాట షూట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారు డ్యాన్సులు ఇరగదీసేశారు. ఆ పాట షూట్ అయ్యాక పవన్ గారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ‘అదరగొట్టేశావయ్యా.. చాన్నాళ్ల తర్వాత నాకు డ్యాన్స్ చేయాలన్న కోరిక కలిగింది. నాతో స్టెప్పులేయించావు’ అన్నారు. ఆ మాట వినగానే నాకు రెక్కలొచ్చాయి. గాల్లో తేలినట్టుందే పాట గుర్తొచ్చింది. ఈ సినిమాను హరీష్ శంకర్ గారు నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు’’ అని దేవి తెలిపాడు.
This post was last modified on September 6, 2025 11:57 am
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…