హీరో, విలన్‍ కొట్టుకుని కమెడియన్‍ని చంపేస్తారా?

బిగ్‍బాస్‍ సీజన్‍ 4కి హీరో అభిజీత్‍ అని డిసైడ్‍ అయిపోయారు. మొదటి పీఆర్‍ మేనేజ్‍మెంట్‍తో ఓట్లు తెచ్చుకున్నా కానీ తర్వాత తన స్మార్ట్ గేమ్‍తో అభిజీత్‍ మిగతా కంటెస్టెంట్లను వెనక్కు నెట్టేసాడు. అభిజీత్‍ హీరో అయితే అతడికి హౌస్‍లో ప్రధాన పోటీదారు అయిన అఖిల్‍ని విలన్‍లా చూస్తుంటారు. మొదటిసారిగా అభిజీత్‍ లేదా హారిక కూడా నామినేషన్లలో లేకుండా అఖిల్‍ నామినేషన్స్ లోకి వచ్చాడు. దీంతో అఖిల్‍పై కోపంతో మోనల్‍కి ఓట్లు వేసేస్తున్నారు.

దీని వల్ల ఈ వారం నామినేషన్లలో వున్నవారిలో కచ్చితంగా ఎలిమినేట్‍ కావాల్సిన మోనల్‍ సేవ్‍ అయిపోయేలా వుంది. అఖిల్‍, సోహైల్‍ ఫాన్స్ ఎలాగో అఖిల్‍కే ఓట్లు వేస్తారు కనుక ఇక అరియానా, అవినాష్‍లలో ఒకరు ఎలిమినేట్‍ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అరియానా పలుమార్లు నామినేషన్లలోకి రావడం వల్ల ఆమెకు గ్యారెంటీ ఓట్లంటూ కొన్ని వున్నాయి. ప్రతిసారీ నామినేషన్లు తప్పించుకోవాలని చూసే కమెడియన్‍ అవినాష్‍ ఇప్పుడు డేంజర్‍లో వున్నాడు. బిగ్‍బాస్‍ ఈవారం ఎలిమినేషన్‍ లేదంటేనో లేదా మరో విధంగా అవినాష్‍ని సేవ్‍ చేస్తేనో తప్ప ఈ వారంతో జబర్దస్త్ కమెడియన్‍ బిగ్‍బాస్‍ ముచ్చట ముగుస్తుంది.