ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. చిన్న ప్యాచ్ వర్క్స్ మినహాయించి మాస్ జాతర దాదాపుగా అయిపోయినట్టే. ఆగస్ట్ 27 విడుదల తేదీని వదులుకున్నాక ఇంకా కొత్త డేట్ ప్రకటించలేదు. అక్టోబర్ లో రావొచ్చని అంటున్నారు కానీ నిర్మాత నాగవంశీ ఫైనల్ కాల్ తీసుకోలేదు. ఇటీవలే అవుట్ ఫుట్ చూసుకుని సంతృప్తి చెందారని, ఒకప్పటి వింటేజ్ రవితేజని చూసి ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారని సన్నిహితులతో అంటున్నారట. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు షో వేశారనే ప్రచారం జరిగింది కానీ దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే గట్టిగానే ఉంది.
ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న మరో మూవీకి అనార్కలి టైటిల్ ప్రచారంలో ఉంది. దీన్ని 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కాకపోతే పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో నిర్ణయాలు మారినా ఆశ్చర్యం లేదు. మాస్ జాతర డేట్ ఫిక్స్ అయితే దానికి సంబంధించిన ప్రమోషన్ల కోసం రవితేజ ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే వీటి తర్వాత మాస్ మహారాజా మరో మూవీకి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించడం ఆల్రెడీ లాక్ చేసుకున్న ప్రాజెక్టు. పెద్ద బడ్జెట్ తో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో సితార బ్యానరే దీన్ని నిర్మించాలని ప్లాన్ చేసుకుంది.
తాజా లీక్ ప్రకారం ఇది కొంచెం ఆలస్యం అయ్యేలా ఉందట. బడ్జెట్ పరంగా లెక్కలు మారిపోతుండటంతో అంత మేరకు థియేట్రికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని గురించి చర్చలు జరుగుతున్నట్టు వినికిడి. కింగ్డమ్ ఫెయిల్యూర్, డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ 2 డిజాస్టర్ కావడం లాంటి కారణాలు సితార బృందాన్ని నెక్స్ట్ చేయబోయే సినిమాలను సమీక్షించుకునేలా చేశాయట. అందులో భాగంగానే రవితేజ 77 ఇంకొంచెం లేట్ అవ్వొచ్చని అంటున్నారు. అంతుచిక్కని మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నిర్మాణాలు, రిలీజులు, వాయిదాలు ఇలా అన్ని అంశాలకు సంబంధించి రివ్యూలు నిర్మాతలకు అవసరమవుతూనే ఉన్నాయి.
This post was last modified on September 5, 2025 9:10 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…