ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది సుందరకాండ పరిస్థితి. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే ఫైనల్ రన్ కు వచ్చేయడం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ముందు రోజు వేసిన ప్రీమియర్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పాయింట్ టిపికల్ గా ఉన్నా దర్శకుడు బాగానే ఎంటర్ టైన్ చేశాడని రివ్యూయర్లు స్పందించారు. కానీ అది కలెక్షన్లలో కనిపించలేదు. ప్రేక్షకుల అనాసక్తి స్పష్టంగా బయట పడింది. సక్సెస్ మీట్లు చేసినా లాభం లేకపోయింది. విజయ యాత్రను ప్రకటించారు కానీ వాటి తాలూకు ఫోటోలు వీడియోలు బయట పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రమోషన్లు ఆపేశారు.
నిజానికి సుందరకాండలో తీసుకున్న పాయింట్ టాలీవుడ్ కు కొత్తది కానీ ఈ తరహా ట్రీట్ మెంట్ తో 35 సంవత్సరాల క్రితం ఒక సినిమా తీశారు. అదేంటో చూద్దాం. 1991. సుప్రసిద్ధ దర్శక నిర్మాత యష్ చోప్రా చాందిని లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లమ్హే చేశారు. విపరీతమైన అంచనాల మధ్య డిజాస్టర్ అయ్యింది. కారణం కథే. అనిల్ కపూర్, శ్రీదేవి ప్రేమించుకుంటారు. కానీ శ్రీదేవి వేరే అతన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కన్నాక భర్తతో సహా ప్రమాదంలో చనిపోతుంది. బ్రతికి బయట పడ్డ కూతురు పెద్దయ్యాక మరో శ్రీదేవి అవుతుంది. వయసులో చాలా వ్యత్యాసమున్న అనిల్ కపూర్ నే ఇష్టపడి అతని జీవితంలో అడుగుపెట్టాక స్టోరీ సుఖాంతమవుతుంది.
దీన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. తండ్రి సమానుడైన హీరోని చనిపోయిన హీరోయిన్ కూతురు లవ్ చేయడం అంగీకరించలేదు. దీంతో ఫలితం సూపర్ ఫ్లాప్. సుందరకాండలో దీన్ని రివర్స్ చేశారు. కాలేజీలో సీనియర్ శ్రీదేవి విజయ్ కుమార్ ని ప్రేమించిన నారా రోహిత్ ఆమెను మిస్సవుతాడు. ఏజ్ బార్ అయ్యాక అదే శ్రీదేవి కూతురు వ్రితి వాఘాని ప్రేమిస్తాడు. ఇది కన్విన్సింగ్ గా చెప్పినా సరే ట్రీట్ మెంట్ లోపాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ పాయింట్ అంతగా నచ్చలేదు. సినిమా పెద్దగా ఆడకపోయినా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడికి మంచి పేరైతే వచ్చింది. త్వరలో అనౌన్స్ మెంట్ రావొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates