Movie News

బన్నీ దర్శనం.. ఎప్పుడు?

టాలీవుడ్లో ఒక సినిమా కన్ఫమ్ చేయడానికి, ఆ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి చాలా టైం తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. స్టార్ ఇమేజ్ సంపాదించాక అతను ఆషామాషీగా ఏ కథనూ ఓకే చేయట్లేదు. మేకింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. తనతో జట్టు కట్టే దర్శకులూ అందుకు తగ్గవాళ్లే ఉంటారు. అందుకే తన సినిమాల రిలీజ్‌కు బాగా టైం పడుతుంటుంది. సినిమాకు సినిమాకు గ్యాప్ పెరిగిపోతుంటుంది. 

‘పుష్ప’ రెండు భాగాల కోసం అతను ఐదేళ్లకు పైగా సమయం వెచ్చించాడు. ‘పుష్ప-2’ రిలీజ్ అయ్యాక అయినా స్పీడు పెంచుతాడనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ముందు అనుకున్న త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి అట్లీతో జట్టు కట్టిన బన్నీ.. ఈ మధ్యే షూటింగ్‌ మొదలుపెట్టించాడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉంది కాబట్టి వచ్చే ఏడాదే ఈ సినిమా రిలీజైపోతుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ అది జరగదన్నది యూనిట్ వర్గాల సమాచారం.

బన్నీ-అట్లీ మూవీ చిత్రీకరణకు ఎంత టైం పడుతుందో.. అంతకుమించి పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం తీసుకోబోతున్నారు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ చిత్రమిది. హాలీవుడ్ టెక్నాలజీ వాడుతున్నారు. పేరున్న వీఎఫెక్స్ స్టూడియోలు పని చేస్తున్నారు. కాబట్టి సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుత అంచనా ప్రకారం 2027 ఆగస్టు రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. 

కానీ ఇలాంటి భారీ చిత్రాలకు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఎలాగూ కొంచెం ఆలస్యం అవడం కామనే కాబట్టి… సినిమా మరింత ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన చూస్తే ‘పుష్ప-2’ వచ్చిన మూడేళ్లకు కానీ బన్నీ తర్వాతి సినిమా రిలీజ్ కాదన్నమాట. ఐతే ఈసారి బన్నీ చేస్తున్న సినిమా తన ఇమేజ్‌ను ఇంకా పెంచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందన్న అంచనాలుండడంతో లేటైనా సరే.. బాక్సాఫీస్ మోత మోగిపోతుందని అభిమానులు ఆశతో ఎదురు చూడాల్సిందే.

This post was last modified on September 4, 2025 3:08 pm

Share

Recent Posts

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

49 minutes ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

2 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

2 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

2 hours ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

4 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

6 hours ago