Movie News

లెజెండరీ ఆలోచన వాడుకున్నారు కానీ

ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది సుందరకాండ పరిస్థితి. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే ఫైనల్ రన్ కు వచ్చేయడం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ముందు రోజు వేసిన ప్రీమియర్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పాయింట్ టిపికల్ గా ఉన్నా దర్శకుడు బాగానే ఎంటర్ టైన్ చేశాడని రివ్యూయర్లు స్పందించారు. కానీ అది కలెక్షన్లలో కనిపించలేదు. ప్రేక్షకుల అనాసక్తి స్పష్టంగా బయట పడింది. సక్సెస్ మీట్లు చేసినా లాభం లేకపోయింది. విజయ యాత్రను ప్రకటించారు కానీ వాటి తాలూకు ఫోటోలు వీడియోలు బయట పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రమోషన్లు ఆపేశారు.

నిజానికి సుందరకాండలో తీసుకున్న పాయింట్ టాలీవుడ్ కు కొత్తది కానీ ఈ తరహా ట్రీట్ మెంట్ తో 35 సంవత్సరాల క్రితం ఒక సినిమా తీశారు. అదేంటో చూద్దాం. 1991.  సుప్రసిద్ధ దర్శక నిర్మాత యష్ చోప్రా చాందిని లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లమ్హే చేశారు. విపరీతమైన అంచనాల మధ్య డిజాస్టర్ అయ్యింది. కారణం కథే. అనిల్ కపూర్, శ్రీదేవి ప్రేమించుకుంటారు. కానీ శ్రీదేవి వేరే అతన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కన్నాక భర్తతో సహా ప్రమాదంలో చనిపోతుంది. బ్రతికి బయట పడ్డ కూతురు పెద్దయ్యాక మరో శ్రీదేవి అవుతుంది. వయసులో చాలా వ్యత్యాసమున్న అనిల్ కపూర్ నే ఇష్టపడి అతని జీవితంలో అడుగుపెట్టాక స్టోరీ సుఖాంతమవుతుంది.

దీన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. తండ్రి సమానుడైన హీరోని చనిపోయిన హీరోయిన్ కూతురు లవ్ చేయడం అంగీకరించలేదు. దీంతో ఫలితం సూపర్ ఫ్లాప్. సుందరకాండలో దీన్ని రివర్స్ చేశారు. కాలేజీలో సీనియర్ శ్రీదేవి విజయ్ కుమార్ ని ప్రేమించిన నారా రోహిత్ ఆమెను మిస్సవుతాడు. ఏజ్ బార్ అయ్యాక అదే శ్రీదేవి కూతురు వ్రితి వాఘాని ప్రేమిస్తాడు. ఇది కన్విన్సింగ్ గా చెప్పినా సరే ట్రీట్ మెంట్ లోపాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ పాయింట్ అంతగా నచ్చలేదు. సినిమా పెద్దగా ఆడకపోయినా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడికి మంచి పేరైతే వచ్చింది. త్వరలో అనౌన్స్ మెంట్ రావొచ్చు.

This post was last modified on September 4, 2025 9:15 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago