మలయాళ చిత్రం ‘లోక’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌లో పెద్ద సెన్సేషన్. ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాకు విడుదల ముంగిటే మలయాళంలో బంపర్ క్రేజ్ వచ్చింది. ఆ చిత్ర బృందం సైతం ఆ హైప్ చూసి షాకైంది. ఈ సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దని ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గించడానికి ప్రయత్నించడం విశేషం. ఐతే సినిమాలో కంటెంట్ ఉండడంతో ఈ హైప్‌తో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించింది.
తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజై ఇక్కడ కూడా మంచి ఫలితాన్నందుకుంది. తమిళనాడు, కర్ణాటకల్లో సైతం సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఐతే ఈ చిత్రం ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఒక సన్నివేశం బెంగళూరు వాసులను హర్ట్ చేసింది. కర్ణాటకలో ఆ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
‘లోక’లో ఒక సన్నివేశంలో విలన్ పాత్రధారి, డ్యాన్స్ మాస్టర్ శాండీ.. బెంగళూరు అమ్మాయిలకు క్యారెక్టర్ ఉండదని, అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోనని కామెంట్ చేస్తాడు. ఈ డైలాగ్ బెంగళూరు వాసులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘లోక’ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐతే ఈ వివాదంపై ‘లోక’ టీం వెంటనే స్పందించింది. వివాదాస్పద డైలాగ్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే.
కర్ణాటకలో తొలి రోజు నుంచి ‘లోక’ మలయాళ వెర్షన్ హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. ఈ సినిమా అప్పుడే వంద కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చేసింది. సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మహానటి’ పేరిట ఉన్న రికార్డును ‘లోక’ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో రూ.150 కోట్ల మైలురాయిని కూడా అలవోకగా దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on September 3, 2025 4:12 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…