అసలు ఎలాంటి ప్రకటన చేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా నిర్మాణం నుంచే అంచనాలను ఆకాశానికి ఎలా తీసుకెళ్ళాలో రాజమౌళికి తెలిసినంతగా ఇండియాలో ఇంకెవరికి తెలియదని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఎస్ఎస్ఎంబి 29. తాజాగా కెన్యా దేశానికి వెళ్లిన జక్కన్న అక్కడి ప్రధాన కేబినెట్ సెక్రెటరీ ముసలియా డబ్ల్యు ముదలాడిని కలుసుకున్నారు. స్వయానా అంతటి స్థాయి వ్యక్తే ఈ కలయిక గురించి గర్వంగా చెప్పుకుంటూ ట్వీట్ చేశారంటే మన టాలీవుడ్ ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మొత్తం 120 టీమ్ సభ్యులతో కెన్యా వెళ్లిన రాజమౌళి అక్కడ చాలా కీలకమైన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. మసై మర, నైవష, సంబూరు, అంబోసెలి లాంటి అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నారు. నిజమైన జంతువులు కొన్ని ఇందులో భాగం కాబోతున్నాయని సమాచారం. ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం కొన్ని పదుల జనరేషన్ల తర్వాత ఒక రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లిన హీరోకు ఎదురయ్యే ప్రమాదాలు అడవి నుంచి మొదలవుతాయని, అందులో భాగంగా వచ్చే సన్నివేశాలన్నీ కెన్యాలోనే షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో రూపొందే వరల్డ్ సినిమాలన్నీ తొంబై శాతం కెన్యాలోనే తీస్తారు.
ఫైట్లు, ఛేజులు, యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పుడీ కెన్యా షెడ్యూల్ లో భాగం కాబోతున్నాయని సమాచారం. దీంతో సగానికి పైగా పూర్తవుతుందని వినికిడి. కెన్యా ప్రముఖ న్యూస్ పేపర్ ది స్టార్ కథనం ప్రకారం ఎస్ఎస్ఎంబి 29 రెండు భాగాలుగా వస్తుంది. కానీ దీనికి సంబంధించి రాజమౌళి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దానికి ఇండియన్ నేటివిటీ జోడించి ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ప్రాథమికంగా 1200 కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చని అంటున్నారు. వివిధ భాషల్లో ఒకేసారి 120 దేశాల్లో ఈ ప్యాన్ వరల్డ్ మూవీని 2027లో రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on September 3, 2025 11:49 am
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…