అన్నీ అనుకున్నట్టు టైంకి జరిగి ఉంటే ఓజి, అఖండ 2 రెండూ ఒకే రోజు సెప్టెంబర్ 25 విడుదలయ్యేవి. కానీ సాంకేతిక కారణాల వల్ల బాలయ్య టీమ్ వెనుకడుగు వేయడంతో పవన్ కళ్యాణ్ కు సోలో గ్రౌండ్ దొరికింది. అయితే తప్పుకోవడం వెనుక తమన్ కూడా ఉన్నాడనేది ఫిలిం నగర్ టాక్. దాని ప్రకారం తమన్ కు ఈ రెండు సినిమాలు చాలా ప్రతిష్టాత్మకం. ముందుగా ఓజి సంగతి చూస్తే ఇప్పటికే పలు వాయిదాలతో ఆలస్యమైన ఈ మూవీకి ఓటిటి వైపు నుంచి థియేట్రికల్ రిలీజ్ ఒత్తిడి ఉండటంతో ఖచ్చితంగా డెడ్ లైన్ మీటవ్వాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో వీరమల్లుకు దీనికి కేవలం రెండు నెలల గ్యాప్ ఉన్నా దానికి సిద్ధపడ్డారు.
ఇక అఖండకు నిన్న వారం దాకా ఓటిటి డీల్ జరగలేదు. ఇటీవలే ఒప్పందం కుదిరిందని సమాచారం. ఆశించిన భారీ రేట్ రావడంతో నిర్మాత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయాలా లేక సంక్రాంతికి వెళ్లాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. విశ్వసనీయ వర్గాలు మాత్రం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న పండగ కన్నా రాజా సాబ్ వదులుకున్న డిసెంబర్ 5 వైపే టీమ్ మొగ్గు చూపుతోందట. ఇక తమన్ విషయానికి వస్తే అఖండ 2కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒత్తిడి మీద చేయలేనని, అకుంఠిత దీక్షతో ఒక యజ్ఞంలా కంపోజ్ చేయాలని వ్యక్తిగతంగా బాలయ్యకు చెప్పాడట.
విన్నపం సబబుగా అనిపించడంతో పాటు ఓజితో తలపడటం వల్ల తనతో పాటు ఇద్దరి ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి కాబట్టి ప్రొడ్యూసర్లతో మాట్లాడి పోస్ట్ పోన్ కి ఎస్ చెప్పినట్టు వినికిడి. ఒకరకంగా జరిగిందంతా మంచికే అనుకోవాలి. తగినంత సమయం దొరకడంతో దర్శకుడు బోయపాటి శీను కొంచెం రిలాక్స్ అవుతూ విఎఫ్ఎక్స్ మీద మరింత దృష్టి పెట్టబోతున్నాడు. పాటలను దసరా నుంచి ఒక్కొక్కటిగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అఖండ 2 నూటా యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగుతుందని టాక్.
This post was last modified on September 2, 2025 9:48 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…