జాన్వి కపూర్ కెరీర్ ఆరంభించింది బాలీవుడ్లో. ఆమె తండ్రి నార్త్ ఇండియన్. కానీ ఆమెను సౌత్ అమ్మాయిలాగే చూస్తారు మనవాళ్లు. అందుక్కారణం తన తల్లి శ్రీదేవి పక్కా సౌత్ ఇండియన్ అమ్మాయి కావడమే. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఎఫ్పుడు అడిగినా.. తనలోని సౌత్ ఇండియన్ మూలాలు బయటికి వచ్చేస్తాయి. తాజాగా తన కొత్త చిత్రం ‘పరమ్ సుందరి’ని ప్రమోట్ చేయడం కోసం కపిల్ శర్మ షోకు వెళ్లిన జాన్వి.. తన పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అందులో అన్నింటికంటే హైలైట్.. పిల్లల గురించి చేసిన కామెంటే. జాన్వికి ముగ్గురు పిల్లలు కావాలట. చాలామంది హీరోయిన్లు పిల్లల్ని కనడానికే ఇష్టపడరు. అలాంటిది ఏకంగా ముగ్గురు పిల్లల్ని కనడం ఏంటి అని అడిగితే.. మూడు తన లక్కీ నంబర్ అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది జాన్వి. ముగ్గురు పిల్లల్ని కనడానికి మరో కారణం చెబుతూ.. ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయని.. అందుకే ముగ్గురు కావాలని.. అప్పుడే ఇంట్లో సందడి ఉంటుందని ఆమె చెప్పింది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. తనకు తన తల్లి స్వస్థలమైన చెన్నైలో, ఆమె పూర్వీకుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నది కోరిక అని వెల్లడించింది. అక్కడ పెళ్లి తంతులన్నీ పూర్తి అయ్యాక తిరుమలలో వివాహం చేసుకోవాలని ఆమె చెప్పింది. అంతేకాక తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉందని.. పంచెలో ఉన్న తన భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం.. అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేయడం.. ఇంతకంటే తనకు వేరే జీవితం అక్కర్లేదని ఆమె చెప్పింది.
This post was last modified on September 1, 2025 4:30 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…