Movie News

కనిపించను కానీ వినిపిస్తా అంటున్న అనుష్క

అదేంటో అనుష్క బయటకి మాత్రం రానంటోంది. నిర్మాతేమో ముందే చేసుకున్న అగ్రిమెంట్ అంటారు. దర్శకుడేమో స్వీటీ కటవుట్ చాలు తను రానవసరం లేదంటారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా హీరో హీరోయిన్లు జనాలను కలుసుకుంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయింది. అలాంటిది టైటిల్ రోల్ పోషించి తన మీదే బిజినెస్ జరుపుకున్న ప్యాన్ ఇండియా మూవీకి అనుష్క దూరంగా ఉండటం విచిత్రమే. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలోనూ ఇదే కట్టుబాటు పాటించినప్పటికీ నవీన్ భారం తీసుకున్నాడు కాబట్టి ఇబ్బంది కలగలేదు. కానీ ఘాటీకి ఆ అవకాశం లేదు.

దీంతో అనుష్క కనిపించను కానీ వినిపిస్తాను అంటోంది. దగ్గుబాటి రానాతో టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మిర్చి ప్లస్ ఎఫ్ఎం ద్వారా హీరో విక్రమ్ ప్రభుతో కలిసి ఆడియో కాన్వర్ జేషన్ చేయబోతోంది. మీడియా ప్రతినిధులకు కూడా ఇదే తరహాలో శ్రవణ సంభాషణలు చేయబోతున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. ఎందుకంటే అభిమానులకు నేరుగా అనుష్కని చూస్తే వచ్చే కిక్కు కేవలం వింటే రాదు. నవ్వినా, ఎమోషనల్ అయినా అవన్నీ విజువల్ చూస్తేనే ఫీలవ్వగలం కానీ వింటే కాదు. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరాల్లో తప్ప ఎంఎఫ్ చానెల్స్ బిసి కేంద్రాల్లో పాపులర్ కాదు.

సెప్టెంబర్ 5 ఇంకో నాలుగు రోజులే ఉంది కాబట్టి ఘాటీకి ఈ టైం కీలకం కానుంది. లిటిల్ హార్ట్స్, మదరాసి కాంపిటీషన్ ఉన్నప్పటికీ బడ్జెట్, కాన్వాస్ పరంగా అనుష్కదే పెద్ద చేయి కాబట్టి ఓపెనింగ్స్ వరకు నిర్మాతలు ధీమాగా ఉన్నారు. కంటెంట్ కనక మెప్పిస్తే జనాలు థియేటర్లకు వస్తారు. వార్ 2, కూలీ తర్వాత బాక్సాఫీస్ కు గ్యాప్ వచ్చేసింది సరైన సినిమాలు లేక థియేటర్లు ఫీడింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్త లోక కాస్త తెరిపినిచ్చింది. టాక్ బాగున్నా సుందరకాండకు ప్రయోజనం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఘాటీకి పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. వస్తే మాత్రం మిరాయ్ రిలీజ్ దాకా దున్నేయొచ్చు.

This post was last modified on September 1, 2025 8:06 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

6 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

36 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago