Movie News

ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ రెస్పాన్స్ ఆ ద‌ర్శ‌కుడికి ఇంధ‌నం

ర‌చ‌యిత‌లకు రైట‌ర్స్ బ్లాక్ అని ఒక‌టుంటుంది. ఒక మూమెంట్లో వాళ్లు స్ట్ర‌క్ అయిపోయి ఇబ్బంది ప‌డుతుంటారు. కొత్త‌గా రాయ‌డానికి ఆలోచ‌న‌లు రావు. అలాంటి స‌మ‌యంలో త‌మ‌లో ఉత్సాహం రావ‌డం కోసం కొంద‌రు టీ తాగుతారు. కొంద‌రు న‌చ్చిన సినిమానో, స‌న్నివేశ‌మో చూస్తారు. ఏదైనా చ‌దువుతారు. ఐతే త‌న‌కు మాత్రం థియేట‌ర్ల‌లో కొన్ని సినిమాల‌కు ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తే జోష్ వ‌స్తుంద‌ని అంటున్నాడు టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్. క‌ల‌ర్ ఫొటో చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించిన సందీప్.. ప్ర‌స్తుతం సుమ‌, రాజీవ్ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల‌తో మోగ్లీ అనే సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. క‌ల‌ర్ ఫొటో త‌ర్వాత సందీప్ రాజ్ మ‌ళ్లీ మంచి విజ‌యాన్ని అందుకుంటాడ‌నే ఉత్సాహాన్నిచ్చింది ఈ టీజ‌ర్. ఈ నేప‌థ్యంలో మా ప్రతినిధికి ఇచ్చిన ఎక్సక్లూసివ్ ఇంట‌ర్వ్యూలో సందీప్ రాజ్ మాట్లాడుతూ.. తాను డౌన్ అయిన‌పుడు ఏం చేస్తానో వెల్ల‌డించాడు. రాజ‌మౌళి తీసిన ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాల‌కు థియేట‌ర్ల‌లో వ‌చ్చిన రియాక్ష‌న్ వీడియోలు చూస్తే త‌న‌కు ఎక్క‌డ లేని ఉత్సాహం వ‌స్తుంద‌న్నాడు.

అప్ప‌టిదాకా డౌన్ అయిన వాడిని అవి చూశాక ఉత్సాహం తెచ్చుకుంటాన‌ని చెప్పాడు. తాను ఆ స‌మ‌యంలో స‌న్నివేశం చూడ‌న‌ని.. కేవ‌లం ఆడియ‌న్స్ రియాక్ష‌న్స్ మాత్ర‌మే గ‌మ‌నిస్తాన‌ని.. అవే త‌న‌కు ఇంధ‌నాన్ని ఇస్తాయ‌ని.. అవి చూశాక కూర్చుని త‌ర్వాతి స‌న్నివేశం రాయ‌డం మొద‌లుపెడ‌తాన‌ని సందీప్ రాజ్ తెలిపాడు. ఇండియ‌న్ సినిమాలో థియేట‌ర్లను హోరెత్తించ‌డంలో రాజ‌మౌళి చిత్రాల‌ను మించిన‌వి ఇంకేవీ ఉండ‌వంటే అతిశ‌యోక్తి కాదు. మ‌గధీర‌, ఈగ‌, బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌కు వ‌చ్చిన స్పంద‌న అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ అమెరికాలో సంచ‌ల‌నం రేపింది. మ‌న సినిమాకు యుఎస్ థియేట‌ర్ల‌లో లోక‌ల్ ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన స్పంద‌న చూస్తే వ‌చ్చే సంతృప్తే వేరు.

This post was last modified on September 1, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar
Tags: Sandeep

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

1 minute ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago