సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, బిలు కమర్షియల్ గా తెలుగులో పెద్దగా ఆడకపోయినా హీరోయిన్ రుక్మిణి వసంత్ కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది. కాకపోతే తర్వాత చేసిన సినిమాలన్నీ టపా కట్టేయడంతో రేస్ లో కొంచెం వెనుకబడింది. ఒకటి రెండు కొంచెం బాగానే ఆడినా అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోవడంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సెప్టెంబర్ 5 విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రుక్మిణి వసంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కళ్ళు తిప్పుకునే కాస్ట్యూమ్ తో ప్రత్యేకంగా రావడం అభిమానులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ మదరాసి చేసే సమయానికి రుక్మిణి వసంత అప్ కమింగ్ హీరోయిన్ అని, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ, యష్ టాక్సిక్, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 ఇలా అన్నింటిలో తనే ఉంటూ మోస్ట్ వాంటెడ్ అయిపోయిందని కితాబిచ్చారు. ఆయన అన్నది నిజమే. ఫ్లాపులే ఎక్కువగా ఉన్నప్పటికీ అవకాశాలను రాబట్టుకోవడంలో రుక్మిణి వసంత్ వెనుకబడలేదు. ముఖ్యంగా తారక్ సరసన డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చాలా పెద్ద బంపరాఫర్ అని చెప్పాలి. శాండల్ వుడ్ నుంచి వచ్చి క్రేజీ ఆఫర్ దక్కించుకోవడం మాటలు కాదు.
కాకపోతే ఇప్పుడు సక్సెస్ తనకు చాలా కీలకం. మదరాసి అసలే మన దగ్గర తక్కువ బజ్ తో విడుదలవుతోంది. దర్శకుడు మురుగదాస్ సక్సెస్ లో లేకపోవడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. అమరన్ బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్ చేసిన సినిమా కావడంతో ఆడియన్స్ లో ఆసక్తి లేకపోలేదు. మరి రుక్మిణి వసంత్ కు ఇందులో మొక్కుబడి హీరోయిన్ క్యారెక్టర్ దక్కిందా లేక నటనకు స్కోప్ ఉందానేది వేచి చూడాలి. మాములుగా మురుగదాస్ సినిమాల్లో కథానాయికకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ రుక్మిణి వసంత్ కు అంత స్కోప్ దక్కి ఉంటే మంచిదే. శుక్రవారం తేలుతుందిగా. చూద్దాం.
This post was last modified on August 31, 2025 9:59 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…