మలయాళంలో బిగ్గెస్ట్ హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా మోహన్ లాల్ పేరు చెప్పేయొచ్చు. ఒకప్పుడు మమ్ముట్టి ఆయనకు గట్టి పోటీ ఇచ్చేవారు కానీ.. గత దశాబ్ద కాలంలో మాత్రం లాల్‌దే హవా. ఈ ఏడాది ‘ఎంపురాన్’, ‘తుడరుమ్’ చిత్రాలతో ఆయన రికార్డులు బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన్నుంచి ఓనమ్ కానుకగా ‘హృదయపూర్వం’ అనే సినిమా చేశారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు రూ.8 కోట్ల మేర వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర శుభారంభం చేసింది ‘హృదయపూర్వం’. కానీ రెండో రోజు ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. లాల్ సినిమాను వెనక్కి నెట్టేసింది. దాని కంటే ఐదు కోట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. ఆ చిత్రమే.. లోకా.
మోహన్ లాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన దర్శకుడు ప్రియదర్శన్ తనయురాలైన కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన సినిమా.. లోకా. ఈ సూపర్ హీరో ఫిలిం తెలుగులో ‘కొత్త లోకా’ పేరుతో రిలీజైంది. ఈ చిత్రం తమిళం, హిందీలోనూ విడుదలైంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. మలయాళంలో అయితే తొలి రోజు నుంచే ప్యాక్డ్ హౌస్‌లతో నడుస్తోంది ఈ చిత్రం. తెలుగులో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి.
తొలి రోజు ఈ చిత్రం రూ.7 కోట్ల మేర వసూళ్లు రాబట్టి ‘హృదయపూర్వం’ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. కానీ పాజిటివ్ టాక్ మరింత స్ప్రెడ్ అవడంతో రెండో రోజుకు సినిమా రేంజ్ పెరిగింది వసూళ్లు రూ.12 కోట్లను దాటిపోయాయి. మోహన్ లాల్ సినిమా పోటీలో ఉండగా.. దాన్ని మించి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ 5 కోట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనడానికి ఇది సరైన రుజువు. మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల రికార్డులన్నీ ‘లోకా’ బద్దలు కొట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది.
This post was last modified on August 31, 2025 6:23 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…