నిర్మాత నాగవంశీకి కేవలం రెండు వారాల గ్యాప్ లో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన కింగ్డమ్ అంచనాలు అందుకోకపోగా రిటర్న్స్ పరంగా నష్టాలే మిగిల్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ పుణ్యమాని మరీ తీవ్రంగా కాకపోవడం కొంత ఊరట కలిగించింది. అయితే వార్ 2 డిస్ట్రిబ్యూషన్ కొట్టిన దెబ్బ మాత్రం మాములుగా కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎక్కువ రేట్ పెట్టేసి దాని డిజాస్టర్ ఫలితం వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సైతం గురి కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళం డబ్బింగ్ కొత్త లోక – చంద్ర పార్ట్ 1 పంపిణి చేసింది సితార సంస్థ.
నిజానికి దీని మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు. అయితే మౌత్ టాక్ సోషల్ మీడియాలో బాగా పాకడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి. డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఆలస్యం కావడంతో నిన్న ఏపీ తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం మూడు షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో ట్విట్టర్, ఇన్స్ టా ఫాలో అవుతున్న వాళ్లకు కంటెంట్ ఏదో బాగుందనే మాట తెలియడంతో వెంటనే టికెట్లు కొనడం మొదలుపెట్టారు. ఏ బజ్ లేని ఈ సినిమా బుక్ మై షోలో గంటకు 2 వేలకు పైగా టికెట్లు అమ్మడం చిన్న విషయం కాదు. మలయాళం వెర్షన్ 18 వేల టికెట్లతో గంట గంటకు నెంబర్ పెంచుకుంటోంది.
ఇప్పటికిప్పుడు దీన్ని సూపర్ హిట్ అనో బ్లాక్ బస్టర్ అనో ప్రకటించలేం కానీ ఇంత రెస్పాన్స్ నిర్మాతలు ఊహించలేదు. సూపర్ వుమెన్ కాన్సెప్ట్ కి డ్రాకులా హారర్ ని జోడించి దర్శకుడు డామినిక్ అరుణ్ చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ ని నడిపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటివి ఆడియన్స్ ని ఫుల్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటే కొత్త లోక ఇంత ఈజీగా జనాన్ని రప్పించడం విచిత్రమే. ఫైనల్ రన్ అయ్యాక స్టేటస్ ఏంటో క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి డామినేషన్ స్టేజిలో ఉంది.
This post was last modified on August 30, 2025 10:42 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…