‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అతను అనూహ్యంగా ఆ సినిమాను పక్కన పెట్టి, అట్లీ ప్రాజెక్టును టేకప్ చేశాడు. సైన్స్ ఫిక్షన్ జానర్లో హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఓ భారీ చిత్రం చేయడానికి ఈ జోడీ రెడీ అయింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. చాన్నాళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేశాక కొన్ని వారాల కిందటే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది.
ఎక్కువగా ముంబయిలో వేసిన భారీ సెట్స్‌లోనే చిత్రీకరణ జరిపేలా చిత్ర బృందం ప్రణాళికలు రచించింది. బన్నీ అక్కడే ఉండి షూట్‌లో పాల్గొంటున్నాడు. ఐతే చిత్రీకరణకు సంబంధించి ఇప్పటిదాకా ఏ చిన్న సమాచారం బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం బన్నీ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బన్నీ వేసిన స్టెప్స్‌కు యూనిట్లో ఉన్న వాళ్లంతా ఫిదా అయిపోయారని.. గూస్ బంప్స్ వచ్చాయని.. బన్నీ పీఆర్ టీం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
ఇది బన్నీ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అట్లీతో బన్నీ సినిమా మొదలై ఎంతో కాలం కాలేదు. మామూలుగా టాకీ పార్ట్ అంతా పూర్తి చేశాక చివర్లో పాటల చిత్రీకరణ జరుగుతుంది. అందులోనూ ఈ సినిమా జానర్ దృష్ట్యా పాటల సంగతి చివర్లోనే చూడాల్సి ఉంటుంది. కానీ ఆరంభ దశలోనే సాంగ్స్ షూట్ ఏంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.
అతను అప్పుడే ట్యూన్స్ ఇచ్చేయడం.. ఒక పాట చిత్రీకరణ జరపడం అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయొచ్చనే అంచనాలున్నాయి. ఇందులో బన్నీ సరసన దీపికా పదుకొనే ఒక కథానాయికగా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అధికారిక సమచారం బయటికి రాలేదు.
This post was last modified on August 30, 2025 2:59 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…