అనిల్ రావిపూడి….
ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన వేల్యూ ఉంది. పటాస్.. సుప్రీమ్.. రాజాదిగ్రేట్.. ఎఫ్2… సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకటి కాదు రెండు కాదు. వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని నిర్మాతలకు, బయ్యర్స్‌కు 100% లాభాలను అందించి ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్పెషల్ బ్రాండ్‌గా నిలిచి జెట్ స్పీడుతో దూసుకెళ్తూ.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే నవంబర్ 23. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితో స్పెషల్ ఇంటర్వ్యూ…
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా దూసుకెళ్తోన్న మీకు.. మీ జర్నీ ఎలా అనిపిస్తుంది?
— చాలా హ్యాపీగా ఉంది. పటాస్‌తో డైరెక్టర్‌గా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. దర్శకుడిగా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా అది. అందుకు కారణం నందమూరి కల్యాణ్‌రామ్‌గారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం. ఓ కొత్త దర్శకుడిని నమ్మి, కథను నమ్మి రిస్క్ ఉన్నా కూడా ఆయనే హీరోగా చేస్తూ సినిమాను నిర్మించారు. కల్యాణ్‌రామ్‌గారికి ఆ విషయంలో నేనెప్పుడూ కృతజ్ఞుడినే. నా కథను నమ్మి ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఇక పటాస్ సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సక్సెస్‌తో ఓ క్రేజీ డైరెక్టర్‌గా నాకు పేరొచ్చింది.
తొలిచిత్రం ‘పటాస్’ మీకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి?
— ఎలాంటి పరిస్థితుల్లో అయినా, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ ఎలా తీయవచ్చు అనే విషయాన్ని పటాస్ సినిమా తెరకెక్కించే సమయంలో నేర్చుకున్నాను. నాకున్న పరిమితుల్లో, పరిస్థితుల్లో సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించాను. నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నా ఫ్యామిలీ అంతా ఆ సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఇది కూడా నాకు మరచిపోలేని ఓ ఎక్స్‌పీరియెన్స్. డైరెక్టర్ కావాలనే నా కలను నిజం చేసిన సినిమా పటాస్.
పటాస్ సక్సెస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
— నాకు ఇష్టమైన డైరెక్టర్ వినాయక్‌గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే దిల్‌రాజుగారు, శిరీష్‌గారు ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత ‘సినిమా మామూలుగా లేదు. తడిగుడ్డ వేసుకుని కూర్చో’ అన్నారు. బి.ఎ.రాజుగారు, జయగారు నాతో గంటసేపు పైగానే మాట్లాడారు. ముఖ్యంగా జయగారు నలబై ఐదు నిమిషాల పాటు సినిమా గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్న పొజిషన్ గురించి జయగారు పటాస్ రిలీజ్ రోజే ఊహించి చెప్పారు. అది మరిచిపోలేని కాంప్లిమెంట్.
సుప్రీమ్ బ్లాక్‌బస్టర్ హిట్‌తో జింగ్ జింగ్ అమేజింగ్ అనిపించుకున్నారుగా?
— పటాస్ సినిమా తర్వాత దిల్‌రాజుగారు ఓ రకంగా నన్ను దతత్త తీసుకున్నారు. అప్పటి నుండి ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాను. ముందు సుప్రీమ్ సినిమా విషయానికి వస్తే.. సాయిధరమ్ తేజ్‌తో చేసిన జర్నీని ఎప్పటికీ మరచిపోలేను. అన్నా, అన్నా అంటూ తేజ్ ఎంతో ఎఫెక్షన్ చూపించేవాడు. అందుకే చాలా కంఫర్ట్‌బుల్‌గా సినిమాను పూర్తి చేశాం. చాలా కూల్‌గా, అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తయ్యింది.
సుప్రీమ్ షూటింగ్‌లో మీకు మెమురబుల్ ఇన్‌సిడెంట్స్ ఏంటి?
— సుప్రీమ్‌లో సమయంలో రాజస్థాన్‌లో చేసిన యాక్షన్ సీన్ నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. లారీలతో చేసిన ఛేజింగ్ సీన్ మరచిపోలేను. అలాగే చిరంజీవిగారి సాంగ్ అందం హిందోళంసాంగ్ రీమిక్స్. ఆ సాంగ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నామంటే ఫ్యాన్స్ మంచి ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తారు. దానికి ధీటుగా చేయాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించాం. జోద్‌పూర్ ప్యాలెస్‌లో సినిమాను షూట్ చేశాం. అంత కష్టపడ్డాం కాబట్టి సినిమా బాగా ఆడింది. తేజ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేశాడు. అలాగే క్లైమాక్స్‌లో దివ్యాంగులందరితో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశాం. దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. దివ్యాంగులందరూ చాలా కష్టపడి యాక్ట్ చేశారు. అప్పట్లో ఈ యాక్షన్ సీన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టానికిఫైట్ మాస్టర్‌కి, ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అబ్బాయి నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను చూసి అమేజింగ్ జింగ్ జింగ్ అని ప్రేక్షకులు కితాబిచ్చారని మీరు గుర్తుపెట్టుకుని చెబుతుంటే మరింత హ్యాపీగా ఉంది.
రాజాదిగ్రేట్ ఓ డిఫరెంట్ మూవీ.. ఓ స్టార్ హీరోని కళ్లులేని దివ్యాంగుడిగా చూపిస్తూ సినిమా చేయడం చాలా సాహసం… మీకు రిస్క్ అనిపించలేదా?
— ఓ స్టార్ హీరోకు కళ్లు ఉండవు అనే పాయింట్‌ను అనుకుని నా ప్రయత్నం మొదలు పెట్టాను. ఆ కథను హీరో రవితేజగారు నమ్మారు. ఆయన నమ్మకం వల్ల కథలో తెలియని ఎనర్జీ యాడ్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ రవితేజగారికే దక్కు తుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌ను నమ్మి సినిమా చేయడం ఆయన చేసిన గొప్ప పని. ప్రాణం పెట్టి సినిమా కోసం పనిచేశారు. నిజంగా రవితేజగారికి కళ్లు లేవా? అనేంత గొప్పగా పాత్రలో ఒదిగిపోయారు. దిల్‌రాజు, శిరీష్‌గారు సినిమాకు ఏం కావాలో దాన్ని అందిస్తూ.. సినిమాను బాగా తీయడానికి బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో చేసిన ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఇప్పుడు చూసినా గూజ్‌బంప్స్ వస్తాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా చేసే సమయంలో సూపర్‌స్టార్ మహేశ్‌గారు ‘రాజాది గ్రేట్’లో ఇంటర్వెల్ ఫైట్‌ను చాలా బాగా చేశారండి’ అన్నారు. అంత పెద్ద స్టార్ హీరో నా సినిమాని అంతగా గుర్తుపెట్టుకుని మాట్లాడటం రియల్‌గా ఓ మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే ఈ సినిమాలో గున్నా గున్నా మామిడి.. సాంగ్ చేసిన మేజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ఆ సాంగ్ క్లిక్ అవుతుందని అనుకున్నాను కానీ.. థియేటర్‌లో ఫస్ట్ బెంచ్ నుండి లాస్ట్ బెంచ్ వరకు ప్రేక్షకులు ఆ పాటకు డాన్స్ చేశారు. అలాగే జీవితానికి సంబంధించిన విషయాలను యాడ్ చేస్తూ చెప్పడం కూడా నాకు నచ్చింది. జీవితం మనకు ఎదురొచ్చి ఏదీ ఇవ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి.. ఇలాంటి డైలాగ్స్ చక్కగా కుదిరాయి. నా హదయానికి దగ్గరైన సినిమాగా రాజాది గ్రేట్‌ను చెప్పొచ్చు. ఎందుకంటే ఓ డైరెక్టర్‌గా కంప్లీట్‌గా రిస్క్ జోనర్‌లో కెళ్లి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాను.
పూర్తిస్థాయి ఫన్ రైడర్ అయిన ఎఫ్2 సినిమా గురించి ఏం చెబుతారు?
— కంప్లీట్‌గా నన్ను మార్చేసిన సినిమా. నాకు గేమ్ చేంజింగ్ మూవీ అనొచ్చు. మూడు యాక్షన్ సినిమాలు చేసిన నాకు పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం చేయాలని అనిపించింది. ఆ సినిమాకు ఎవరు యాప్ట్ అవుతారు అనిపించగానే వెంకటేశ్‌గారు తప్ప ఇంకొకరు నాకు కనిపించలేదు. అలాగే యంగ్ హీరోస్‌లో నాకెంతో క్లోజ్ అయిన వరుణ్‌తేజ్‌ను అనుకుని సినిమా చేశాను. నా లైఫ్‌లోని చిన్న చిన్న పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు, పెళ్లైన ప్రతి వాడి జీవితంలో ఉండే చిలిపి సంఘటనలతో సరదాగా సినిమా చేద్దామని చేసిన సినిమా. ఫ్యామిలీ లైఫ్‌లో ఉండే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటే అందరూ కనెక్ట్ అవుతారనిపించింది. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. ఆ సంక్రాంతిని నవ్వుల సంక్రాంతిగా మార్చింది. నేను 1999లో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాను చూసినప్పుడు బాల్కని నుండి నేల టికెట్ వరకు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం చూశాను. ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు అలా నవ్వడం ప్రత్యక్షంగా చూశాను. ఫ్యామిలీలోని అన్ని ఎజ్ గ్రూపులవాళ్లు నవ్వుతున్నారు. ఆ సినిమా చేయడానికి ఓ గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకుల మీద మరింత గౌరవం పెరిగింది. నేను చేసిన ప్రతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఎఫ్2 సినిమాను ఏకంగా వాళ్లింట్లో పెట్టుకున్నారు. ఎఫ్ 2 ఇచ్చిన బ్యాంగ్ ఒకటి కాదు. ఆ సినిమా ఇండియన్ పనోరమకు సెలక్ట్ అయ్యింది. ఈ ఇంటర్నేషనల్ అవార్డుల్లో బెస్ట్ మూవీగా ‘ఎఫ్2’కి, బెస్ట్ డైరెక్టర్‌గా నాకు అవార్డును సాధించింది. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబుగారితో ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమా చేసే అవకాశం రావడం ఇంకా పెద్ద కిక్ ఇచ్చింది. అలాగే ‘ఎఫ్2’ సినిమా నన్ను డైరెక్టర్‌గా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన గేమ్ ఛేంజర్. ఈ సినిమా చేసే సమయంలో ‘మీరు చేసిన సినిమాలన్నింటిలో ‘ఎఫ్2′ సినిమానే ఎక్కువ లాభాలను తెచ్చిపెడు తుంది సార్’ అని దిల్‌రాజుగారితో సరదాగా చెప్పేవాడిని. నిజంగా సినిమా విడుదలైన తర్వాత దిల్‌రాజుగారు స్టేజ్ పై మాట్లాడుతూ మా ఎస్‌వీసీ బ్యానర్‌లోనే ‘ఎఫ్2’ సినిమా బిగ్గెస్ట్ ఫ్రాఫిటబుల్ మూవీ అని అనౌన్స్ చేశారు. అంత పెద్ద ప్రాఫిట్స్ నా నిర్మాతకు వస్తే డైరెక్టర్‌గా నాకంత కంటే ఆనందమేముంది. ఈ సినిమా సమయంలో వెంకటేశ్‌గారితో జర్నీ చేయడం.. నా అదష్టం. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ వచ్చాను. తర్వాత ఆయన్ని డైరెక్ట్ చేయడం ఓ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌గా అనిపించింది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పది సినిమాలైనా చేస్తాను. అంత కంఫర్టబుల్ హీరో. చాలా స్వీట్ పర్సన్. జెన్యూన్ హీరో. వరుణ్‌తేజ్ కూడా అంతే కంఫర్ట్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ హీరో. ఓ ఎమోషనల్ జర్నీ.
సరిలేరునీకెవ్వరుతో ఇండస్ట్రీ హిట్ సాధించడం .. ఎలాంటి అనుభూతి కలిగించింది?
— ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నా కెరీర్‌లోనే ఓ ఛాప్టర్. దాని పేరు ూూవీదీ. నా పేరు మీద నేను రాసుకున్న చాప్టర్. నేను నలబై ఐదు నిమిషాల కథను చెప్పగానే మహేశ్‌గారు నన్ను నమ్మి,’ఈ సినిమాను మనం చేస్తున్నాం అనిల్’ చెప్పగానే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రతి డైరెక్టర్‌కి ఓ పెద్ద హీరోతో సినిమా చేయాలనే గోల్ ఉంటుంది. కానీ ఆ అవకాశం ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం వేరు. పటాస్ సినిమా మార్నింగ్ షో విడుదలైనప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో, అలాగే మహేశ్‌గారు పిలిచి అనిల్‌గారు మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పగానే అంత ఆనందమేసింది. అంత గొప్ప అవకాశం వచ్చింది. అంత గొప్ప అవకాశం ఇచ్చిన మహేశ్‌గారికి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఆరోజే ఫిక్స్ అయ్యాను. చాలా తక్కువ సమయంలో జూలైలో స్టార్ట్ చేసి సంక్రాంతికి వచ్చేశాం. ఈ జర్నీలో విజయశాంతిగారు కూడా యాడ్ అయ్యారు. ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చారు. మహేశ్‌గారు అందరి యాక్టర్స్‌ను కలుపుకుని ఓ పిల్లర్‌గా నిలిచారు. ఆయన సపోర్ట్ వల్లే ఈ సినిమా ను సంక్రాంతికి తీసుకు రాగలిగాం. క్యారెక్టర్‌ను చెడుగుడు ఆడేశారు. ఓ కామెడీ, ఓ ఎమోషన్, ఓ పేట్రియాటిజమ్, ఓ యాక్షన్ .. మైండ్ బ్లాక్ డాన్స్, రమణ లోడెత్తాలిరా అంటూ చేసిన ఫైట్ ఇలా ఆల్‌రౌండింగ్ పెర్ఫామెన్స్..వన్ మేన్ షో చేశారు. మహేశ్‌బాబుగారి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే తెలుగులోని టాప్ ఫైవ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. కరోనా టైమ్‌లో డిస్ట్రిబ్యూటర్స్ నిలబడగలుగుతున్నారంటే అందుకు కారణమైన సినిమాల్లో మన సినిమా కూడా ఒకటి కావడం ఆనందంగా ఉంది. అంత పెద్ద ప్రాఫిట్స్‌ని తీసు కొచ్చాయి. ఇక నిర్మాత అనీల్‌సుంకరగారితో సూపర్ జర్నీ. సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. అద్భుతమైన సెట్స్ వేయించారు.
వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌తో మీరు సాధించిన స్థానం ఎంత వరకు సంతృప్తినిస్తోంది?
— నిజంగా ఇది అదృష్టం. ఏ సినిమాకు ఆ సినిమా హిట్ అవ్వాలని కష్టపడతాం. అలా వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్ రావడం చూసి నా ఫ్రెండ్స్ చాలా మంది పంచ పాండవులని, పంచ రత్నాలని పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఐదు సినిమాల వల్ల కెరీర్‌లో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించడమే కాదు. ఫైనాన్సియల్‌గా ఎదిగాను. ఇవన్నీ కాకుండా రీసెంట్‌గా క్రియేటివ్ సైడ్ మరో జర్నీని స్టార్ట్ చేశాను. నా స్నేహితుడు ఎస్. కష్ణతో ఇన్ని రోజులు నాతో ఉన్నాడు. తను కూడా ఓ మంచి కథతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. షైన్ స్క్రీన్స్ సాహుగారపాటి, హరీశ్ పెద్దిగారితో కలిసి చేస్తున్న గాలి సంపత్ సినిమాను తన భుజాలపై వేసుకుని కష్ణ నడిపిస్తున్నాడు. ఓ మిత్రుడిగా, నా వంతు క్రియేటివ్ సపోర్ట్‌ను అందిస్తూ స్క్రీన్‌ప్లే చేసి పెట్టాను. దర్శకుడిగా నేను చేస్తున్న సినిమాలతో పాటు సమాంతరంగా ఎస్. కృష్ణ బ్యానర్‌లోని సినిమాలకు నా క్రియేటివ్ సపోర్ట్ ఉంటుంది. సాయి నిర్మాణం అంటే.. తను నా మనిషి. తను చేసే సినిమాలకు నేను అన్ని విధాలుగా ఉంటాను.
నెక్ట్స్ మూవీ ఎఫ్ 3 ఎప్పుడు చేయబోతున్నారు?
— ఎఫ్ 3 కోసం డిసెంబర్ 14 నుండి షెడ్యూల్‌ను దిల్‌రాజుగారు ప్లాన్ చేసుకున్నారు. ఎఫ్ 2 సినిమాను ఎంత మంది ప్రేక్షకులు తమదిగా భావించారో నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌కు మరో ఎఫ్ యాడ్ అవుతుంది. గెట్ రెడీ ఫర్ మోర్ ఫన్. ఈ కరోనా స్ట్రెస్ తర్వాత మనస్ఫూర్తిగా మిమ్మల్ని నవ్వించడానికి వస్తున్నాం. కరోనాకు వ్యాక్సిన్ వస్తుందో రాదో కానీ.. కచ్చితంగా ఎఫ్ 3తో ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలను.
సూపర్‌స్టార్ మహేశ్‌తో సినిమా మళ్లీ ఎప్పుడు ఉంటుంది?
— మహేశ్‌గారు అనిల్ అని పిలిస్తే చాలండి.. నేను డోర్ తెరుచుకుని వెళ్లి ఆయన ముందు కూర్చుం టాను. ఆయన ఇంటి అడ్రస్ కూడా తెలుసు. నా కారు ఆయన ఇంటి ముందు ఆగిపోతుంది. ఆయన ఇంట్లో చెఫ్ మంచి స్నాక్స్ చేసి పెడతారు అవి తింటూ ఆయనకు కథ చెప్పి సినిమా ఓకే చేయించుకుంటా. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెఢీ. ఆయన పిలిస్తే పరిగెత్తుకెళ్లడమంతే.
ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
— చాలా ఐడియాలున్నాయండి.. ఈ జర్నీలో ఓ సినిమా తర్వాత మరో సినిమా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. ప్రొడక్షన్‌లో కూడా సాయి సపోర్ట్‌తో డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళతాను. ప్రేక్షకులు ఆదరించినంత కాలం ఇలాగే నా అనుకునే వాళ్లతో కలిసి పాజిటివ్‌గా ముందుకెళుతున్నాను. అదే నాకు శ్రీరామరక్ష.
మీలో మంచి యాక్టర్ కూడా ఉన్నాడుగా.. మిమ్మల్ని నటుడిగా తెరపై చూడొచ్చా?
— ప్రేక్షకులు దర్శకుడిగా ఇక చాలు బాబు(నవ్వుతూ) అనే వరకు డైరెక్షనే చేస్తాను. ఆ తర్వాతే యాక్టింగ్ గురించి ఆలోచిస్తాను.
ఈ పుట్టినరోజును మీకు హ్యాపీయెస్ట్ బర్త్‌డే అని అనుకోవచ్చా?
— హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు. అన్ని రకాలుగా నాకు ఆనందాన్ని ఇచ్చిన సంవత్సరం. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున నాకు కొడుకు అజయ్ సూర్యాంశ్ పుట్టాడు. సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాను. ఈ ఏడాది పుట్టినరోజుకు మా ఫ్యామిలీలో మరో మెంబర్ ఉన్నాడు. చాలా ఆనందం గా ఉంది. మా ఆవిడ భార్గవి, పాప శ్రేయాశ్రీతో పాటు అజయ్ సూర్యాంశ్ జాయిన్ అయ్యాడు. ఈసారి పుత్రోత్సాహంతో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటాను.
పుట్టినరోజు పండుగ జరుపుకోవడంపై మీ ఓపినియన్ ఏంటి?
— పుట్టినరోజు అనేది ప్రతి మనిషికి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సాధించగలుగుతున్నామంటే పుట్టినరోజుకి తప్పకుండా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు గర్వపడే విజయాలు సాధించాలి. ప్రతి పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన డెవలప్‌మెంట్‌ని మనం కంపేర్ చేసుకుంటూ మరిన్ని విజయాలు సాధించడానికి ముందుకెళ్లాలి.
సినిమాపై ప్యాషన్‌తో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మీకు కెరీర్ పరంగా ఎంత వరకు శాటిస్పాక్షన్‌గా ఉన్నారు?
— చాలా సంతోషంగా ఉన్నానండి.. జీరో శాతం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమా, నేను పనిచేసిన ప్రతి హీరోకి రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను వారంతగా నమ్మారు. కల్యాణ్‌రామ్ నుండి మహేశ్‌బాబు వరకు నేను చేసిన ప్రతి సినిమా వాళ్లు నాపై పెట్టిన నమ్మకమే. ఈరోజు నేనున్న ఈ స్థాయికి కారణం నేను పనిచేసిన ప్రతిహీరో, ప్రతి ప్రొడ్యూసర్, దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, అనీల్ సుంకరగారు. ప్రేక్షకులు, నాతో ఉన్న టీమ్ అందరూ నన్ను నమ్మారు. సినిమా అనే అద్భుతమే నన్నింత వరకు నడిపించింది.
మీరు సెట్‌లో మార్నింగ్ సెవెన్‌కి ఎంత ఎనర్జీతో ఉంటారో రాత్రి ఒంటిగంటయినా అదే ఎనర్జీతో షూటింగ్ చేయడం చాలా సార్లు గమనించాను.
అంత ఎనర్జీ మీకు ఎలా వస్తుంది?
— సినిమా అనేది నాకు ఒక స్వర్గం. స్వర్గంలో ఉన్నవాడు ఎవడైనా డల్‌గా ఉంటాడా చెప్పండి. నేను ప్రతిక్షణం స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతాను. అదే నాకు కావాల్సినంత ఎనర్జీ ఇస్తుంది. షూటింగ్ సందడే నాకు స్వర్గం కనుక నిరంతరం స్వర్గంలోనే ఉండాలని కోరుకుంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.
This post was last modified on November 22, 2020 10:24 pm
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక అదనపు షోలు, రేట్లు తెచ్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. తెలంగాణలో ఏడాదికి పైగా…
నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయమై సోషల్…
ఇంకో రెండు రోజుల్లో థియేటర్లలోకి దిగబోతోంది ‘గేమ్ చేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రమిది.…
తెలంగాణ రాజకీయాలను సాధారణ ప్రజలను కూడా ఓ కుదుపు కుదిపేసిన 'హైడ్రా' వ్యవహారం అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనూహ్యంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన…