నవదీప్.. వివాదం.. రెండూ విడదీయలేని పదాలు. 20 ఏళ్లకు పైగా కెరీర్లో అతడి చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. నటుడిగా ఎంతో ప్రతిభావంతుడు అయినప్పటికీ.. ఈ వివాదాల వల్ల కొంతమేర తన కెరీర్ కూడా దెబ్బతింది. ఏదైనా కాంట్రవర్శీ తలెత్తినపుడు.. దాని విషయంలో నవదీప్ స్పందించే తీరు కూడా చిత్రంగా ఉంటుంది. తాజాగా అతను ఒక టీవీ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఈసారి ‘బిగ్ బాస్’ షోలోకి కొందరు సామాన్యులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను తీసుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లను షార్ట్ లిస్ట్ చేయడం కోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విజేత బిందుమాధవిలతో పాటు నవదీప్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.
ఐతే ఈ షోలో శ్రీజ అనే అమ్మాయిని ఉద్దేశించి నవదీప్‌తో పాటు యాంకర్ శ్రీముఖి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ షోలో ఏమైనా అన్‌ఫెయిర్‌గా జరిగిందని ఎవరైనా భావిస్తున్నారా అని శ్రీముఖి అడగ్గా.. శ్రీజ చెయ్యి పైకెత్తింది. ఆమె వెర్షన్ వినకుండానే చాల్లే కూర్చో అంది శ్రీముఖి. అనంతరం శ్రీజ వచ్చి తన వెర్షన్ చెప్పగా.. నవదీప్ చాలా వ్యంగ్యంగా స్పందించాడు.
బిగ్ బాస్‌లో వందల ఎపిసోడ్లను షూట్ చేశారని.. కానీ ఇప్పుడు ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చి నువ్వు అన్‌ఫెయిర్ అంటే నడవదని కామెంట్ చేశాడు నవదీప్. దానికా అమ్మాయి బాగా హర్టయింది. ఈమాత్రం దానికి పిలవడం ఎందుకు అంటూ ఆవేదనగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊరు అంటే చిన్న చూపా.. ఒకమ్మాయిని ఉద్దేశించి అలా కామెంట్ చేస్తారా అంటూ నవదీప్ మీద విరుచుకుపడ్డారు. దీంతో అతను సారీ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయినా నెటిజన్లు ఊరుకోవడం లేదు. నవదీప్ అహంకారి అంటూ అతడి మీద ట్రోల్స్ వేస్తున్నారు.
This post was last modified on August 28, 2025 8:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…