నివేథా పెతురాజ్.. తెలుగు వారికి కూడా బాగానే పరిచయమున్న తమిళ నటి. ఆమె తెలుగులో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్, అల వైకుంఠపురములో, పాగల్, విరాట పర్వం.. ఇలా చాలా సినిమాలే చేసింది. తమిళంలో కూడా కొన్ని క్రేజీ చిత్రాల్లో నటించింది నివేథా. ఐతే తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది నివేథా. ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఆమె పేరు తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. అది కూడా ఫ్లాప్ మూవీ.
కెరీర్ ఆరంభంలో ఉదయనిధితో కలిసి నటించిన నివేథా మళ్లీ అతడితో జట్టు కట్టలేదు. కానీ ఆల్రెడీ పెళ్లయిన ఉదయనిధికి నివేథాతో సంబంధం ఉన్నట్లు ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ ఛానెళ్లలో వీరి గురించి రకరకాల కథనాలు వస్తుంటాయి. ఉదయనిధి కోసం నివేథా పెళ్లి కూడా మానుకుందని.. ఆమె కోసం దుబాయ్‌లో ఉదయనిధి లగ్జరీ ఫ్లాట్ కొన్నాడని.. అక్కడే ఆమెను తరచూ కలుస్తుంటాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
ఐతే ఈ ప్రచారాలన్నింటికీ తెరదించుతూ ఒక అప్‌డేట్ ఇచ్చింది నివేథా. త్వరలోనే తన పెళ్లి జరగబోతున్న విషయాన్ని నివేథా వెల్లడించింది. రజిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడబోతోంది. తనతో నిశ్చితార్థం అయిన విషయాన్ని నివేథా అధికారికంగా ప్రకటించింది. ఎంగేజ్మెంట్ ఫొటోను కూడా సోషల్ మీడియాలో నివేథా పంచుకుంది. రజిత్ ఒక వ్యాపారవేత్త అట. అతడికి వివిధ దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయట. వీళ్లిద్దరూ ఫారిన్లోనే సెటిల్ కాబోతున్నట్లు సమాచారం. నివేథా స్వయంగా ఎంగేజ్మెంట్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఊహాగానాలకు ఇంతటితో తెరపడ్డట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates