డిజాస్టర్ అందుకున్న వార్ 2 ఫలితం గురించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాత్కాలికంగా కలత చెంది ఉండొచ్చు కానీ నిజానికి దీని వల్ల జరిగిన మంచిని కూడా గమనించాలి. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో నిర్మాత ఆదిత్య చోప్రా స్పై యూనివర్స్ లో తారక్ పోషించిన ఏజెంట్ విక్రమ్ చలపతి పాత్రను భాగం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఒక స్టాండ్ అలోన్ మూవీకి హామీ కూడా ఇచ్చారు. కానీ వార్ 2 ఈ లెక్కలను తారుమారు చేసింది. ఒకవేళ హిట్టయ్యుంటే జూనియర్ ఎన్టీఆర్ ఒకటో రెండో స్పై సిరీస్ సినిమాలు చేయాల్సి వచ్చేది. ఇంకో బాలీవుడ్ హీరోతో మళ్ళీ తెరను పంచుకోవాల్సి వచ్చేది.
ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో మన తెలుగు స్టార్లు హిందీ దర్శకులతో పదే పదే చేతులు కలపడం సేఫ్ కాదు. ఖాన్ హీరోలు లోకేష్ కనగరాజ్, అట్లీ అంటూ సౌత్ డైరెక్టర్ల వెంట పడుతూ ఉంటే మనోళ్లు అయాన్ ముఖర్జీ లాంటి బలమైన బేస్ లేని వాళ్ళను నమ్ముకోవడం రిస్క్ అవుతుంది. అందుకే తారక్ లైనప్ లో వాళ్ళు లేకపోవడమే సేఫవుతుంది. ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి పవర్ హౌస్ బ్రాండ్లను మించినవాళ్లు బాలీవుడ్ లో ఎవరున్నారు. భూతద్దం పెట్టి వెతికినా ఇప్పటికిప్పుడు వీటికి సాటివచ్చే వాళ్ళు లేరు. ఇది కాదనలేని నిజం.
అందుకే వార్ 2 ఎంత దారుణంగా పోయినా సరే ఫ్యాన్స్ కలత చెందాల్సిన పని లేదు. యష్ రాజ్ ఫిలింస్ డిసెంబర్ లో రిలీజయ్యే అలియా భట్ అల్ఫా ఫలితాన్ని బట్టి స్పై ప్రపంచాన్ని ఎలా విస్తరించాలనే కీలక నిర్ణయం తీసుకోనుంది. టైగర్ వర్సెస్ పఠాన్ దాదాపు లేనట్టే. సల్మాన్, షారుఖ్ ఇద్దరూ ఆసక్తి చూపించడం లేదట. టైగర్ 4 కష్టమే. పఠాన్ 2 సైతం ఊరికే గాసిప్స్ లో తిరుగుతోంది కాబట్టి సెట్స్ పైకి వెళ్లడం డౌటే. ఇక వార్ 3 కల్లో మాట. అవెంజర్స్ రేంజ్ లో దీన్ని ఎక్స్ పాండ్ చేయాలనుకున్న ఆదిత్య చోప్రా కలను వార్ 2 భగ్నం చేసింది. వేరే ఆర్టిస్టులతో వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్ చర్చలో ఉందట.
This post was last modified on August 26, 2025 4:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…