కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడి ప్రేక్షకులు ఇళ్లకు పరిమితమైన సమయంలో ఓటీటీ సంస్థలు విజృంభించాయి. ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి సినిమాలను కొని నేరుగా రిలీజ్ చేశాయి. అంతే కాక థియేటర్లలో వచ్చిన సినిమాలను కూడా త్వరగా డిజిటల్ రిలీజ్ చేయడం ద్వారా ఆదరణ పెంచుకున్నాయి. రెండు మూడేళ్ల పాటు ఓటీటీలన్నీ సినిమాలకు మంచి మంచి రేట్లు ఇచ్చేవి. క్రేజున్న సినిమాల డిజిటల్ హక్కుల కోసం వాటి మధ్య పోటీ ఉండేది. ఓ మోస్తరు సినిమాలన్నింటికీ ఈజీగా డిజిటల్ హక్కులు అమ్ముడయ్యేవి. కానీ గత రెండేళ్లలో కథ మారిపోయింది. ఓటీటీలు రేట్లు తగ్గించేశాయి. కొనే సినిమాల సంఖ్యనూ తగ్గించుకున్నాయి.
ఇప్పుడు నిర్మాతలు డిమాండ్ చేసే స్థితిలో లేరు. డిజిటల్ హక్కుల అమ్మకం కోసం వాళ్లే వెంటపడే పరిస్థితి ఉంది. కోరుకున్న రేట్లూ దక్కడం లేదు. ఇలాంటి టైంలో ఓ సినిమా మాత్రం ఓటీటీ సంస్థలే తమ వెంట పడేలా, ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేసేలా చేస్తోంది. ఆ చిత్రమే.. మహావతార నరసింహ.
కన్నడలో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ మూవీ గత నెల రోజులుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సాగిస్తోందో తెలిసిందే. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై కన్నడతో పాటు తెలుగు, హిందీలో సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆ సినిమా కలెక్షన్లు రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి.
విడుదలై నాలుగు వారాలు దాటినా ఆ సినిమా జోరు తగ్గడం లేదు. ఈ వీకెండ్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఐతే ఈ చిత్రానికి విడుదలకు ముందు డిజిటల్ హక్కుల అమ్మకం జరగలేదు. నిర్మాతలే అమ్మలేదా.. ఓటీటీల నుంచి ఆఫర్లు లేవా అన్నది తెలియదు. డిజిటల్ హక్కులు అమ్మకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇప్పుడేమో సినిమా ఇరగాడేసింది.
థియేటర్లలో ఈ సినిమాను చూసేవాళ్లు బాగానే చూస్తున్నారు. ఓటీటీలోకి వస్తే చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్లూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఫ్యామిలీస్, పిల్లలకు నచ్చే సినిమా కావడంతో ఓటీటీలోకి వచ్చాక మంచి డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఓటీటీలు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. భారీ చిత్రాలతో సమానంగా మహావతార నరసింహ డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యే అవకాశముంది.
This post was last modified on August 25, 2025 6:54 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…