ఒకప్పుడు టాలీవుడ్లో బిజీ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు అనిల్ సుంకర. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ‘14 రీల్స్’ బేనర్లో ‘దూకుడు’ సహా పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన.. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో విడిగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలనూ ప్రొడ్యూస్ చేశాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత 14 రీల్స్ నుంచి బయటికి వచ్చి ఏకే బేనర్లోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. ఆ సంస్థను పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు అనిల్. కానీ వాటిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాగా ఆడినా.. ఆ తర్వాతి చిత్రాలు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
అఖిల్ అక్కినేని మీద భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘ఏజెంట్’.. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అనిల్ ప్రొడక్షన్ హౌస్ సంక్షోభంలో పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భోళాశంకర్’ తనను ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో ఆయన పరోక్షంగా మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియా జనాలు చిరంజీవి వైపు వేలెత్తి చూపించడం మొదలుపెట్టారు. చిరంజీవి వల్ల మంచి నిర్మాత దెబ్బ తిన్నాడంటూ కౌంటర్లు వేశారు. మరోవైపు చిరు అభిమానులు.. అనిల్ కామెంట్లకు హర్టయ్యారు.
ఐతే ఒక ఇంటర్వ్యూలో అనిల్.. చిరు తనకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘భోళా శంకర్’ ఫెయిల్యూర్ తర్వాత చిరు తనకు ఎంతగానో అండగా నిలిచారని.. ఆ నష్టాల నుంచి బయటపడడానికి సాయం చేశారని అనిల్ తెలిపారు. ఇక ‘ఏజెంట్’ ఫలితం గురించి అనిల్ మాట్లాడారు. ఈ సినిమాకు అఖిల్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదన్నాడు. సినిమా బాగా ఆడితే రెమ్యూనరేషన్ తీసుకునేవాడని.. అలా జరక్కపోవడంతో అతను ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదని అనిల్ వెల్లడించాడు.
This post was last modified on August 24, 2025 5:03 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…