సెప్టెంబర్ 5 విడుదల కావాల్సిన మిరాయ్ వాయిదా పడటం ఖాయమేనని విశ్వసనీయ సమాచారం. ఇప్పటిదాకా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోవడం, ఫెడరేషన్ సమ్మె వల్ల బ్యాలన్స్ ఉన్న ముఖ్యమైన పనులు ఆగిపోవడం ఫైనల్ కట్ ని ఆలస్యం చేస్తున్నాయని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికిప్పుడు అవన్నీ పూర్తి చేసుకుని పది రోజుల్లో సిద్ధం చేయడం జరగని పనని భావించడంతో వాయిదా వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇది చూచాయగా తెలిసిన మరుక్షణం సోషల్ మీడియా స్టార్ మౌళి హీరోగా రూపొందిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5 వచ్చేందుకు రెడీ అవుతోందట. అనౌన్స్ మెంట్ ఏ నిమిషమైనా రావొచ్చు.
ఇప్పుడు మిరాయ్ చేతిలో ఉన్నది సెప్టెంబర్ 12 ఒకటే. అక్కడేమో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కిష్కిందపురి ఉంది. దానితో కాంపిటేషన్ గురించి టెన్షన్ అక్కర్లేదు కానీ ముందైతే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వెనక్కు తగ్గడమో లేదా బయ్యర్లు థియేటర్ల సర్దుబాటు గురించి మాట్లాడుకోవడమో చేయొచ్చు. మాస్ జాతర ఎలాగూ వచ్చే సూచనలు లేవు కాబట్టి ఆ డేట్ సేఫ్ అవుతుంది. సెప్టెంబర్ 25 ఓజి ఉంటుంది. దానితో ఢీ కొట్టడం ఎంత మాత్రం సేఫ్ కాదు. అసలు మిరాయ్ నిర్మాత టిజి విశ్వ ప్రసాదే దానికి ఒప్పుకోరు. లేదంటే అక్టోబర్ కు వెళ్లడం తప్ప మిరాయ్ కు మరో ఆప్షన్ ఉండదు. ఇదో పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది.
హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో తేజ సజ్జకు మిరాయ్ సోలో రిలీజ్ చాలా కీలకం. హనుమాన్ టైంలో సంక్రాంతి సీజన్ కాబట్టి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ ను తట్టుకుని కంటెంట్ బలంతో గెలిచాడు. ప్రతిసారి పరిస్థితులు అంత సానుకూలంగా ఉండవు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ మూవీ నాన్ థియేటర్ హక్కుల ద్వారా ఆల్రెడీ లాభాలు ఇచ్చింది. కానీ థియేటర్ రెవిన్యూ వస్తే కానీ తేజ సజ్జ మార్కెట్ కు ప్లస్ కాదు. మరి మిరాయ్ సెప్టెంబర్ 5 కే కట్టుబడుతుందా లేక వారం వాయిదా అంటుందా లేక ఏకంగా నెక్స్ట్ మంత్ కు వెళ్తుందా అనేది వేచి చూడాలి.
This post was last modified on August 23, 2025 11:20 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…