ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్నదే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు సంపాదించిన రాజమౌళి నుంచి రాబోయే తర్వాతి చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తన ప్రతి సినిమాకూ రెట్టింపయ్యే అంచనాలను అందుకోవడానికి రాజమౌళి తన టీంతో కలిసి ఎంత కష్టపడతాడో తెలిసిందే. మహేష్ సినిమాకు కూడా ఆయన అంతే శ్రమిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. మామూలుగా ఒక సినిమా మొదలుపెట్టేముందు లేదా షూటింగ్ ఆరంభ దశలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా విశేషాలను పంచుకోవడం రాజమౌళికి అలవాటు. కానీ మహేష్ మూవీ విషయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించలేదు జక్కన్న.
ఇప్పటిదాకా ఏ ప్రెస్ మీట్ లేదు. సినిమా నుంచి అధికారికంగా ఏ విశేషాన్నీ పంచుకోలేదు. ఇటీవల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లాంచ్ చేస్తారేమో అని ఆశిస్తే అదీ జరగలేదు. కానీ నవంబరులో ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు జక్కన్న. ఐతే మహేష్ పుట్టిన రోజు కాదని.. నవంబరులోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్‌కు జక్కన్న ముహూర్తం పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని సమాచారం. ఆ నెలలో ఓ విశిష్ట అతిథి ఇండియాకు రాబోతున్నాడు. ఆయనే.. లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.
‘అవతార్’ ఫ్రాంఛైజీలో కొత్త చిత్రం ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాని ప్రమోషన్ కోసం కామెరూన్ నవంబరులో భారత్‌కు వస్తాడు. ఆ సందర్భంగా ఆయన చేతుల మీదుగానే మహేష్-రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ కాబోతోందట. రాజమౌళి చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కామెరూన్‌ను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూకు హాజరైన కామెరూన్.. రాజమౌళి అండ్ టీం మీద ప్రశంసలు కురిపించాడు.
ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలను కొనియాడుతూ స్పెషల్ వీడియో బైట్ కూడా ఇచ్చాడు. తనను అంతగా ఇంప్రెస్ చేసిన రాజమౌళి నుంచి రాబోయే తర్వాతి సినిమా పట్ల ఆయనకూ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్, రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి ఆయన్ని టీం అడగడం.. ఆయన అంగీకరించడం జరిగాయి. కామెరూన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అయితే అంతర్జాతీయంగా సినిమాకు వచ్చే పబ్లిసిటీనే వేరుగా ఉంటుంది. అందుకే మహేష్ పుట్టిన రోజును కూడా స్కిప్ చేసి నవంబరు నెలలో ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి జక్కన్న అదిరిపోయే ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాడు.
This post was last modified on August 21, 2025 2:38 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…