దర్శకుడు అనిల్ రావిపూడి కోరుకున్నట్టే జరుగుతోంది. చిరంజీవితో తను చేస్తున్న సినిమా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే విడుదల చేయాలనే సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. విశ్వంభర ఏకంగా 2026 వేసవికి వాయిదా పడటంతో తనకు రూట్ క్లియరయ్యింది. మన శంకర్ వరప్రసాద్ గారు టైటిల్ ఆల్రెడీ లీకైపోయింది. పండక్కు వస్తున్నారుని ట్యాగ్ లైన్ గా పెట్టారు. రేపు చిరు పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ లాంటి గ్లిమ్ప్స్ తో పేరుని రివీల్ చేయబోతున్నారు. దీంతో రావిపూడి మార్క్ ప్రమోషన్లకు కొబ్బరికాయ కొట్టినట్టే. క్రమంగా పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళ్లడం చూడబోతున్నాం.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలున్నాయి. విశ్వంభరకు బజ్ లేదన్నది బహిరంగ రహస్యం. అందులోనూ హరిహర వీరమల్లు లాంటివి చూశాక అభిమానుల్లోనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ వల్లే వార్ 2 ఎక్కువ ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. అందుకే టీమ్ ఎంత ఆలస్యమైనా సరే బెస్ట్ గ్రాఫిక్స్ తో అల్టిమేట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇబ్బంది అయినా సరే ఇంకో ఆరు నెలలు అదనపు సమయం తీసుకుంటున్నారు. దీని వల్ల క్వాలిటీ పెరుగుతుంది. దర్శకుడు వశిష్ఠకు ఇంత టైం దొరికింది కాబట్టి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలి.
ఇప్పుడు మన శంకర వరప్రసాద్ విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి వండుతున్న వినోదాల విందు మాములుగా లేదని ఇన్ సైడ్ టాక్. ఇంకా సగం షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ ప్రతి అంశం మీద క్లారిటీగా ఉన్న దర్శకుడు ఈసారి కూడా థియేటర్లను ఈలలు, నవ్వులు, కేకలతో హోరెత్తించడం ఖాయమంటున్నారు. ఇది హిట్టయితే ఆటోమేటిక్ గా విశ్వంభర బిజినెస్ కు ఉపయోగపడుతుంది. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న మెగా మూవీగా మన శంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో అదిరిపోతాయి. ఫ్యాన్స్ కి కావాల్సింది అదే.
This post was last modified on August 21, 2025 10:06 am
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…