Movie News

మంచి వీకెండ్… ఖాళీగా వదిలేస్తున్నారే

ఒక వారం మధ్యలో ఏదైనా పెద్ద పండుగ లేదా సెలవు రోజు పడితే ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌తో సినిమాలకు బాాగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఇలాగే కూలీ, వార్-2 చిత్రాలకు ప్లస్ అయింది. గురువారం ఈ సినిమాలు రిలీజయ్యాయి. శుక్ర, శని, ఆదివారాలు సెలవు కావడంతో కలిసొచ్చింది. రెండు చిత్రాలకూ టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీని తర్వాత సినిమాలకు అలా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది వినాయక చవితి వీకెండ్. 

ఈ నెల 27న, బుధవారం వినాయక చవితి సెలవు. ఆ రోజున సినిమా రిలీజ్ చేస్తే ఐదు రోజుల పాటు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. కానీ ఈ వీకెండ్‌ను టాలీవుడ్ ఉపయోగించుకునేలా కనిపించడం లేదు. చవితి రోజు రావాల్సిన మాస్ రాజా రవితేజ సినిమా ‘మాస్ జాతర’ వాయిదా పడిపోవడం థియేటర్లకు పెద్ద షాక్. కూలీ, వార్-2 చిత్రాలు ఆ సమయానికి స్లో అయిపోతాయి కాబట్టి.. చవితి రోజు క్రేజ్ ఉన్న సినిమా వస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. 

కానీ వారం ముందు వరకు 27కు పక్కా అనుకున్న ‘మాస్ జాతర’ ఇప్పుడు వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబరు 12న కొత్త డేట్ అంటున్నారు. కారణాలేవైనా కానీ.. ‘మాస్ జాతర’ను వాయిదా వేయడం ద్వారా గోల్డెన్ ఛాన్స్ మిస్సయినట్లే. సెప్టెంబరులో రాబోతున్న ఘాటి, మిరాయ్ చిత్రాల్లో ఏదైనా ఒకటి వినాయక చవితి వీకెండ్లో వచ్చినా వాటికి ప్లస్ అయ్యేది. 

ప్రస్తుతానికి సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్ లాంటి చిన్న సినిమాలే చవితి వీకెండ్లో రాబోతున్నాయి. వాటికి పెద్దగా బజ్ లేదు. టాక్ బాగుంటే వాటికి ఆ వీకెండ్ పెద్ద అడ్వాంటేజీ ఉన్నట్లే.

This post was last modified on August 20, 2025 2:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

2 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

2 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

3 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

5 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

5 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

6 hours ago