ఆకాశమే హద్దుగా అంచనాలు మోసుకుంటూ వచ్చిన కూలీ వాటిని అందుకోవడంలో తడబడింది. 400 కోట్ల వసూళ్లు వచ్చాయని నిర్మాణ సంస్థ చెబుతున్నప్పటికీ వీక్ డేస్ నుంచి తగ్గిపోయిన ఆక్యుపెన్సీలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తమిళంలో ఓకే కానీ ఇతర భాషల్లో ఫ్లాప్ దిశగా అడుగులు వేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మల్టీప్లెక్సుల్లో రెవిన్యూ మీద సెన్సార్ ఇచ్చిన ఏ సర్టిఫికెట్ ప్రభావం తీవ్రంగా పడింది. 18 లోపు వయసున్న పిల్లలను అనుమతించకుండా నిబంధనలు కఠినంగా పాటించడంతో చాలా ఫ్యామిలీస్ రజని సినిమాకు దూరంగా ఉన్నాయి. ఇది వసూళ్లను బాగా దెబ్బ కొట్టిన మాట నిజం.
డ్యామేజ్ గుర్తించిన సన్ పిక్చర్స్ రంగంలోకి దిగింది, సంస్థ తరఫున లాయర్ జె రవీంద్రన్ ఎమర్జెన్సీ హియరింగ్ కోసం పిల్ వేయడంతో రేపు దాని మీద వాదోపవాదాలు జరగనున్నాయి. చాలా ఎక్కువ వయొలెన్స్ ఉన్న కెజిఎఫ్ లాంటి సినిమాలకు యు/ఏ ఇచ్చినప్పుడు కూలికి మాత్రమే అడల్ట్స్ ఓన్లీ ఇవ్వడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ సన్ కంపెనీ న్యాయస్థానంలో కేసు వేసింది. నిజానికి మొదటి తప్పు ప్రొడక్షన్ హౌస్ నుంచే జరిగింది. ఏ సర్టిఫికెట్ రాగానే అదేదో గర్వకారణం అనే రేంజ్ లో ప్రమోషన్లకు వాడుకున్నారు. ఇది చూసే ఫ్యాన్స్ మితిమీరి ఊహించుకున్నారు. ఆశించిన దాంట్లో సగం వయొలెన్స్ కూడా సినిమాలో లేదు.
మరి ఎందుకు ఇలా ఏ ఇచ్చారని అప్పుడే అడిగి ఉంటే ఈ గొడవ జరిగేది కాదు. యానిమల్ లాగా యునానిమస్ గా టాక్ వచ్చి ఉంటే ఇప్పుడీ కోర్టు పంచాయితీ అవసరం పడేది కాదు కానీ టాక్ తేడా కొట్టడం వల్లే ఆఘమేఘాల మీద ఈ చర్యకు ఉపక్రమించారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టినట్టు వారం తర్వాత మేల్కోవడం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని భావించిన కూలీ ఇప్పుడు సగం దాటితే చాలనేలా మారిపోయింది. మరీ వార్ 2 అంత అన్యాయంగా పోలేదు కానీ కొండంత ఆశలు పెట్టుకుంటే వాటిలో రాయంత మాత్రమే అందుకోవడం అసలు ట్రాజెడీ.
This post was last modified on August 19, 2025 7:42 pm
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…