వచ్చే వారం ఆగస్ట్ 22 విడుదలవుతున్న సినిమాల్లో అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టిలో ఉన్నది పరదా ఒకటే. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ కు మంచి ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో పదే పదే రివ్యూలో చూసి రమ్మని హీరోయిన్, దర్శకుడు చెప్పడం చూస్తే గట్టి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేస్తున్నాం రివ్యూలు బాగుంటేనే రండి, నచ్చితేనే నలుగురికి చెప్పమని రిపీట్ చేయడం కొంచం బజ్ వచ్చేలా చేస్తోంది. కాకపోతే దీని వల్ల లాభమూ రిస్క్ రెండూ ఉన్నాయి.
ఇదే దర్శకుడు శుభం టైంలో కూడా సినిమా చూసి పిచ్చెక్కిపోతారు, ఎప్పుడూ చూడని కంటెంట్ ఇస్తానని చాలా ధీమాగా చెప్పారు. తీరా చూస్తే నిర్మాత సమంత నాన్ థియేట్రికల్ రెవిన్యూతో గట్టెక్కింది కానీ కమర్షియల్ రిజల్ట్ కోణంలో చూసుకుంటే యావరేజ్ గానే నిలిచింది. ఇప్పుడు పరదా విషయంలోనూ అలాంటి స్ట్రాటజీనే ఫాలో కావడం గమనార్హం. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు. రివ్యూలు ఎలాగూ మద్దతు ఇస్తాయి. మహావతార్ నరసింహకు ఎలాంటి హడావిడి చేయకపోయినా మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉంది. మల్టీస్టారర్స్ ఉన్నా వార్ 2, కూలీలు యునానిమస్ టాక్ తెచ్చుకోలేకపోయాయి.
భారం మొత్తం తన మీదే ఉంది కాబట్టి అనుపమ పరమేశ్వరన్ పరదా మీద చాలా ఆశలే పెట్టుకుంది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు పడ్డాయి కానీ తర్వాత పెద్దగా కనిపించలేదు. టిల్లు స్క్వేర్ హిట్టయినా దాని వల్ల సిద్ధూ జొన్నలగడ్డ ఎక్కువ లాభపడ్డాడు కానీ అనుపమకు కలిగిన ప్రయోజనం తక్కువే. రవితేజతో చేసిన ఈగల్ డిజాస్టర్ ఖాతాలోకి చేరుకుంది. మరి పరదా కనక సక్సెస్ అయితే లక్కు దక్కినట్టే. కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో అనుపమ మరో మూవీ కిష్కిందపురి సెప్టెంబర్ 12 రిలీజ్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో తను ఇంకొన్ని వారాలు హైదరాబాద్ లోనే ఉండబోతోంది.
This post was last modified on August 17, 2025 9:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…