బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ చలాకీదనంతో వేగంగా సినిమాలు చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. యానిమల్ నుంచి మనకు ఇంకా దగ్గరయ్యాడు. 90 దశకంలో మీసాలతో ఖాన్లకు గట్టి పోటీ ఇచ్చిన స్టార్ గా అనిల్ కపూర్ గుర్తింపు ప్రత్యేకం. అయితే తన కెరీర్ ప్రారంభం అయ్యింది టాలీవుడ్ లోనే. 1980 సంవత్సరం బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షంతో సోలో హీరోగా తొలి అడుగులు వేశాడు. అయితే అది ఫ్లాప్ కావడంతో ఇక్కడి దర్శకులు తన ప్రతిభను గుర్తించలేదు. దీంతో ముంబై తిరిగి వెళ్ళిపోయాడు.
తర్వాత అక్కడ బ్లాక్ బస్టర్లు సాధించడం, మార్కెట్ మీద పట్టు సాధించడం జరిగిపోయాయి. నాలుగు దశాబ్దాల తర్వాత అనిల్ కపూర్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ లో ఆయన్ని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు తెలిసింది. ఇది నిజమైతే ఈ ప్రాజెక్టుకి నార్త్ లో ఇంకొంచెం హైప్ తోడవుతుంది. అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదానేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అనిల్ కపూర్ హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉన్నాడు. డేట్లు అంత సులభంగా దొరకడం లేదు.
మరి వెంకీ అట్లూరి ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ తో వార్ 2లో తెరను పంచుకున్న అనిల్ కపూర్ కు అది హిందీ సినిమా కాబట్టి రీ ఎంట్రీ కిందకు రాదు. కానీ సూర్యతో వెంకీ అట్లూరి చేసేతున్న మూవీ బై లింగువల్. తెలుగుతో పాటు తమిళంలో షూట్ చేస్తున్నారు. డబ్బింగ్ కాదు. సో ఆ లెక్కన ఇదే పునఃప్రవేశం కిందకు వస్తుంది. సూర్య, అనిల్ కపూర్ కాంబినేషన్ తెరమీద బాగుంటుంది. 2026 వేసవిని టార్గెట్ గా పెట్టుకున్న సూర్య మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. కరుప్పు పూర్తయిపోవడంతో సూర్య ఫోకస్ మొత్తం దీని మీదే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates