సాయిపల్లవి.. ఈ పేరు ఎంత సంప్రదాయబద్ధంగా అనిపిస్తుందో.. ఆమె సినిమాల్లో ఎంచుకునే పాత్రలు, తన అప్పీయరెన్స్ కూడా అంతే సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఆమె గ్లామర్ ఒలకబోయలేదు. హద్దులు దాటి నటించలేదు. ఇక ముందు కూడా అందుకు అవకాశమే లేదని అంటోంది సాయిపల్లవి.
ఎన్ని కోట్లిచ్చినా తాను అంగాంగ ప్రదర్శన చేయలేనని ఆమె స్పష్టం చేసింది. మొదట్నుంచి తన ఉద్దేశం ఇదేనని.. కెరీర్లో ఎప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండదని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
తనకు దర్శకులు గ్లామర్ పాత్రలు ఆఫర్ చేయకుండా ఏమీ లేదని.. ఎక్స్‌పోజింగ్ చేయాలని అన్నారని.. దీంతో చాలా సినిమాలు వదులుకున్నానని సాయిపల్లవి వెల్లడించింది. ఈ విషయంలో తనకెలాంటి రిగ్రెట్స్ లేవని సాయిపల్లవి స్పష్టం చేసింది. తాను మొదట్నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయి లాగే కనిపించానని.. కురచ దుస్తులు వేసుకోవడం, శ్రుతి మించి అంగాంగ ప్రదర్శన చేయడం తనకు ఇష్టం ఉండదని సాయపల్లవి చెప్పింది.
‘ఫిదా’ సినిమాలో ఒక సన్నివేశంలో మాత్రం షార్ట్ డ్రెస్ వేసుకున్నానని.. అది సన్నివేశానికి అవసరం కాబట్టే చేశానని.. అవసరం లేకున్నా మరో సినిమాలో అలా కనిపించమంటే ఒప్పుకోనని.. ఒత్తిడి చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేసింది సాయిపల్లవి. ఆమె చెప్పడం అనే కాదు కానీ.. ప్రేక్షకులు కూడా సాయిపల్లవిని సెక్సీ రోల్స్‌లో చూడాలని అనుకోరు. ఆమెను అభిమానించే కోణమే వేరు.
కేవలం నటనతోనే కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోవడం సాయిపల్లవికే చెల్లింది. ప్రస్తుతం తెలుగులో ఆమె రానా దగ్గుబాటి సరసన ‘విరాట పర్వం’ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 1, 2020 2:18 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…