కంగువ, రెట్రో వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న సూర్య ఆశలన్నీ ఇప్పుడు కరుప్పు మీదే ఉన్నాయి. ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. నిజానికిది దీపావళి లేదా దసరాకు వస్తుందని అనుకున్నారు కానీ ఆ స్లాట్లు ఆల్రెడీ ప్యాన్ ఇండియా సినిమాలతో నిండిపోవడంతో ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తున్నట్టు చెన్నై రిపోర్ట్. ఆగస్ట్ మినహాయించి ఇంకో నాలుగు నెలలు సమయం ఉంది కాబట్టి ప్యాచ్ వర్కులు, రీ రికార్డింగ్, ప్రమోషన్లకు ఆ టైం సరిపోతుందని భావిస్తున్నట్టు సమాచారం. అసలు ట్విస్టు వేరే ఉంది.
2026 సంక్రాంతి ఇప్పటికే పిచ్చ టైట్ గా ఉంది. చిరంజీవి – అనిల్ రావిపూడిల మెగా 157 వెనక్కు తగ్గే సూచనలు లేవు కానీ విశ్వంభర డేట్ మీద నిర్ణయం ఆధారపడి ఉంది. రవితేజ – కిషోర్ తిరుమల కాంబో మూవీ ఈ పండక్కి తీసుకురావాలనే సంకల్పంతో షూట్ ని పరుగులు పెట్టిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు ఆల్రెడీ డేట్ తో సహా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభాస్ ది రాజా సాబ్ జనవరి 9 తేవాలని బయ్యర్లు నిర్మాత మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆయన మాత్రం డిసెంబర్ 5కే మొగ్గు చూపుతున్నారు. విజయ్ జన నాయగన్ ఆల్రెడీ అదే డేట్ మీద ఫస్ట్ కర్చీఫ్ వేసుకుని ఉంది.
వీటి మధ్యలో సూర్య కరుప్పు వస్తే అనవసరంగా క్రష్ అవుతుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కరుప్పు టీజర్ చూశాక ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఫిలింగా అనిపించింది తప్ప ప్రత్యేకంగా ఏదో యునిక్ కంటెంట్ ఉన్న ఫీలింగ్ ఇవ్వలేదు. సూర్య డ్యూయల్ రోల్ అంటున్నారు కానీ అదెంతవరకు నిజమో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. పైన చెప్పిన లిస్టు ప్రకారం చూసుకుంటే నిజంగా కాంపిటీషన్ లో దిగితే సూర్యకే రిస్క్ అవుతుంది. ముఖ్యంగా తెలుగులో సరైన థియేటర్లు దొరకడం కూడా కష్టమే. మరి కరుప్పు మేకర్స్ నిర్ణయం మార్చుకుంటారో లేక పోటీ సవాల్ కు సై అంటారో వేచి చూడాలి.
This post was last modified on August 16, 2025 9:41 pm
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…