సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి అంచనాలకు మించి ఓపెనింగ్ తెచ్చుకుంది. హైప్ విపరీతంగా ఉండటంతో అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదనే విషయం సోషల్ మీడియాలో కనిపిస్తోంది కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టికెట్లకు డిమాండ్ మాములుగా లేదు. మెయిన్ స్క్రీన్లన్నీ వీకెండ్ దాకా హౌస్ ఫుల్స్ కావడం ఖాయం. తమిళనాడులో ఆదివారం దాకా టికెట్ ముక్క లేదు. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించు ఇదే సీన్ కనిపిస్తోంది. టాక్ డివైడ్ గా ఉన్నా సరే అధిక శాతం ప్రేక్షకులు ఒక్కసారైనా కూలిని చూడాలని డిసైడయ్యారు కాబోలు టికెట్లు భారీగా తెగుతున్నాయి.
సన్ పిక్చర్స్ అఫీషియల్ గా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ ని ప్రకటించింది. ఇప్పటిదాకా ఓపెనింగ్ లో లియో పేరు మీద ఉన్న రికార్డుని దాటేసి 151 కోట్లతో ఘనంగా మొదలుపెట్టింది. ఫ్యాన్స్ కోసం అంకెలు పెద్దగా చేసి చూపించడం లాంటి ప్రయత్నాలకు నిర్మాణ సంస్థ దూరంగా ఉండటం విశేషం. రజని స్టార్ పవర్ ఏంటో మరోసారి దీంతో బయట పడింది. అయితే టాక్ ప్రభావం బుకింగ్స్ మీద పడిన మాట వాస్తవం. ఆశించిన దానికన్నా ట్రెండింగ్ కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ వార్ 2 మీద స్పష్టమైన ఆధిపత్యం చెలాయించడం కలెక్షన్లలో కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ 20 కోట్ల గ్రాస్ నమోదు చేసినట్టు ట్రేడ్ టాక్.
ఇక కూలికి అసలు లక్ష్యం ముందుంది. వారాంతం దాకా ఇదే దూకుడు కొనసాగించాలి. ఆ తర్వాత డ్రాప్ మరీ తీవ్రంగా ఉండకూడదు. ఆన్ లైన్ లో నడుస్తున్న నెగటివ్ క్యాంపైన్ ని జనం ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది ఇక్కడ కీలకం కానుంది. వార్ 2 కంటే చాలా నయమనే మాట కూలికి రక్షగా నిలవనుంది. అయితే రజని, లోకేష్, నాగార్జున కాంబోలో చాలా ఎక్కువ ఊహించేసుకున్న సగటు ఆడియన్స్ కి అంత మోతాదులో కంటెంట్ లేకపోవడంతో తమ నిరసనని పోస్టుల రూపంలో ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. లియోకి కూడా ఇలాంటి సీన్ కనిపించింది. మరి కూలి దీన్ని తట్టుకుని టార్గెట్ చేరుకుంటాడేమో చూడాలి.
This post was last modified on August 15, 2025 4:17 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…