Movie News

A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చినట్టు

మూడు గంటల సేపు కూలి చూశాక అందరికి వచ్చిన సందేహం ఒకటే. అసలు ఎందుకు దీనికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారనేదే ఆ డౌట్. ఇందులో వయొలెన్స్ ఉంది. చంపడాలు, నరుక్కోవడాలు అన్నీ పెట్టాడు లోకేష్ కనగరాజ్. అయితే ఏవీ శృతి మించి లేవు. విలన్ గా నటించిన నాగార్జునని డార్క్ షేడ్ చూపించినా సరే అతను చేసే హత్యలు మరీ కళ్ళు పక్కకు తిప్పుకునేలా ఉండవు. సౌభిన్ సాహిర్ ఇతరులను పెట్టే హింస కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ అది కూడా చిన్న పిల్లలు జడుసుకునేంత కాదు. ఆ మాటకొస్తే యానిమల్, పుష్ప 2 కన్నా యాక్షన్ కంటెంట్ కూలీలో తక్కువగా ఉందనే నిజాన్ని ఎవరూ కాదనరు.

కొన్ని బూతు మాటలు, హింసకు సంబంధించిన రెండు మూడు విజువల్స్ తప్ప మరీ హైలైట్ అయ్యే అడల్ట్ కంటెంట్ కూలిలో లేదు. యు/ఏ ఇచ్చినా సరిపోయేది. ఇంతకన్నా కొట్టుకోవడాలు, ఫైట్లు వార్ 2లోనే ఎక్కువగా ఉన్నా దానికి ఏ ఇవ్వలేదు. సెన్సార్ కోరిన మార్పులకు టీమ్ అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. కానీ కూలి విషయంలో లోకేష్ కనగరాజ్ కాంప్రమైజ్ కాలేదు. ఏ ఇచ్చినా పర్వాలేదు తాను ఫైనల్ చేసిన వెర్షనే ఉండాలనుకున్నాడు. దీంతో నిర్మాత కళానిధి మారన్, హీరో రజనీకాంత్ సైతం ఓకే అనేశారు. ఫలితంగా అడల్ట్స్ ఓన్లీ ముద్రతో కూలి థియేటర్లలో అడుగు పెట్టింది.

లోకేష్ పంతం మంచిదే కానీ ఇప్పుడీ చర్య వల్ల 18 ఏళ్ళ లోపు వాళ్ళను మల్టీప్లెక్సులు కూలి స్క్రీన్లలోకి అనుమతించడం లేదు. ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన ఇచ్చినప్పటికీ పలువురు పిల్లలతోనే థియేటర్ కు వస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ కావడంతో వద్దని చెప్పే అవకాశం ఎగ్జిబిటర్లకు లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సెన్సార్ చెప్పిన కట్స్ మ్యూట్స్ చేసుకుని రీ సెన్సార్ చేసుకుంటే కలెక్షన్లు మరింత మెరుగు పడతాయని డిస్టిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది జరగని పని. ఎలాగూ కలెక్షన్లు అదిరిపోతున్నాయి కాబట్టి నిర్ణయం మారకపోవచ్చు.

This post was last modified on August 15, 2025 6:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

36 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago