సౌత్ ఇండియాలో అత్యధిక సినిమా టికెట్ల ధరలు ఉన్నది తెలంగాణలో. ఏపీలో కూడా రేట్లు తక్కువేమీ కాదు. అయినా సరే.. పెద్ద సినిమాలు వచ్చినపుడల్లా వారం పది రోజుల పాటు అదనపు రేట్లు వడ్డించడం అలవాటైపోయింది. తెలంగాణలో పుష్ప-2 రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల ఈ రేట్ల పెంపుకి బ్రేక్ పడింది. కానీ ‘హరిహర వీరమల్లు’కు మళ్లీ రేట్లు పెంచారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు షెడ్యూల్ అయిన వార్-2, కూలీ చిత్రాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి గట్టిగా ట్రై చేశారు. ఐతే సోషల్ మీడియా వ్యతిరేకత వల్లో లేక డబ్బింగ్ సినిమాలన్న కారణంతోనో లేక చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలకు తప్ప వేరే వాటికి పెంపు ఉండదన్న మెలిక వల్లో.. మొత్తానికి ఈ వీకెండ్ సినిమాలకు అదనపు రేట్లు వడ్డించలేదు. ఏపీలో మాత్రం రేట్లు పెంచారు.
ఐతే తెలంగాణతో పోలిస్తే ఏపీలో రేట్లు కొంచెం తక్కువ కాబట్టి పర్వాలేదనుకోవచ్చు. ఐతే ఈ రెండు చిత్రాలకు తెలంగాణలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే.. టికెట్ల ధరలు పెంచకపోవడం వాటికి మేలు చేసినట్లే కనిపిస్తోంది. హైదరాబాద్‌లో తొలి రోజు ‘కూలీ’ దాదాపుగా ప్రతి షోకూ హౌస్ ఫుల్‌తో రన్ అయ్యేలా కనిపిస్తోంది. వార్-2 ఆక్యుపెన్సీలు కూడా చాలా బాగున్నాయి. చాలా షోలు ఫుల్స్ అయ్యాయి. రేపు వాకిన్స్ కూడా తోడైతే ఆ సినిమా కూడా ఓవరాల్‌గా 80-90 శాతం ఆక్యుపెన్సీలతో నడిచే ఛాన్సుంది. రెండు చిత్రాలకూ టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం బుకింగ్స్ పెద్ద ఎత్తున జరగడానికి కచ్చితంగా కారణం అనడంలో సందేహం లేదు.
రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వీకెండ్ అంతా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిపోవడం కారణం. ఈ సందర్భంలో ఒకసారి ‘హరిహర వీరమల్లు’ విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ముందు రోజు భారీ రేట్లతో ప్రిమియర్స్ వేశారు. వాటికి భారీగా వసూళ్లు వచ్చాయి. కానీ ఆ షోల నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. తొలి రోజుకే చాలా చోట్ల థియేటర్లలో ఆక్యుపెన్సీలు పడిపోయాయి. రెండో రోజుకు థియేటర్లు ఖాళీ అయిపోయాయి. రేట్లు అందుబాటులో ఉంటే.. ఓ మోస్తరుగా అయినా జనం చూసేవాళ్లు. కానీ రేట్లు ఎక్కువ, బ్యాడ్ టాక్‌తో ఆ సినిమా అన్యాయం అయిపోయింది. కూలీ, వార్-2 చిత్రాలకు టాక్‌తో సంబంధం లేకుండా వీకెండ్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయంటే.. ఆ సినిమాలకు ఉన్న క్రేజ్‌కు తోడు రేట్లు అందుబాటులో ఉండడం వల్లే అనడంలో సందేహం లేదు. టికెట్ల ధరలు పెంచితే కచ్చితంగా ఆక్యుపెన్సీలు ఈ స్థాయిలో ఉండేవి కాదన్నది స్పష్టం.
This post was last modified on August 14, 2025 12:52 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…