టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రసవత్తర సమరం జరగబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ తెచ్చుకున్న వార్-2, కూలీ చిత్రాలు రేపు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఈ రెండూ డైరెక్ట్ తెలుగు సినిమాలు కావు. ‘వార్-2’ బాలీవుడ్ మూవీ కాగా.. ‘కూలీ’ తమిళ చిత్రం. వీటిలో మన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ‘వార్-2’ తారక్ మరో హీరో కాగా.. ‘కూలీ’లో నాగ్ విలన్ పాత్ర పోషించడం విశేషం. తారక్‌కు ఇదే తొలి స్ట్రెయిట్ హిందీ మూవీ కాగా.. నాగ్ తమిళంలో ఇప్పటికే హీరోగా ‘రక్షగన్’ చేశాడు. కానీ విలన్‌గా ఆయన కెరీర్లోనే తొలి చిత్రమిది. దీంతో ఈ ఇద్దరు హీరోలకూ ఈ సినిమాలు ఎంతో ప్రత్యేకం.
ఈ సినిమాల్లో వీరి పాత్రలు ఎలా హైలైట్ అవుతాయి.. వారి పెర్ఫామెన్స్‌కు ఎలాంటి స్పందన వస్తుంది.. వీరి క్యారెక్టరైజేషన్, కథలో వాటి డామినేషన్ ఎలా ఉంటుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తారక్, నాగార్జున చివరగా బాక్సాఫీస్ దగ్గర 2016లో పోటీ పడ్డారు. అప్పుడు తారక్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ మంచి ఫలితాన్నే అందుకున్నప్పటికీ.. దాని మీద నాగ్ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ పైచేయి సాధించింది. ఐతే తారక్, నాగ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం, నాగ్‌ను తారక్ బాబాయి అని పిలవడం వల్ల వీళ్లిద్దరి అభిమానులు ఫ్యాన్ వార్స్ చేయడాల్లేంటేవీ ఉండవు.
ఇప్పుడు కూడా అలా అభిమానులు గొడవ పడే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ భీకరంగా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ ‘కూలీ’దే డానిమనేషన్ అని చెప్పొచ్చు. ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమాలు ఎలా ఉన్నాయన్నదాని బట్లి సీన్ మారొచ్చు. ఈ చిత్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. అంతిమంగా ఏది విజేతగా నిలుస్తుంది.. వేరే ఇండస్ట్రీలకు వెళ్లి తారక్, నాగ్ నటించిన ఈ చిత్రాల్లో వారి పాత్రలు ఎలా హైలైట్ అవుతాయి… సినిమాల్లో వాటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతున్నాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండూ మంచి ఫలితాన్నందుకుని.. తారక్, నాగ్ పాత్రలూ హైలైట్ అయితే అప్పుడు అందరికీ సంతోషమే.
This post was last modified on August 13, 2025 3:05 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…