అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు నమోదు చేస్తున్న కూలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో ఊహకు అందటం లేదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా రజనీకాంత్ చెలరేగిపోవడం ఖాయం. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యం కావడం వెనుక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ అదే నిజం. స్వయంగా తనే ఈ విషయం చెప్పడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఖైదీ నుంచే లోకేష్ కనగరాజ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలనే లక్ష్యం ఉండేది. మూడేళ్లు చాలా ట్రై చేశాడు. ఒక లైన్ వినిపించాడు కానీ అది సిద్ధం కాకుండానే కమల్ వచ్చి విక్రమ్ కోసం తీసుకెళ్లిపోయాడు.
దానికన్నా ముందు మాస్టర్, తర్వాత లియో చేశాడు లోకేష్. ఇలా ఏళ్ళు గడిచిపోయాక ఓసారి అనిరుధ్ తో మాట్లాడుతూ రజనితో పెండింగ్ ఉండిపోయిన సినిమా గురించి మనసులో కోరిక చెప్పాడు. ఆయన కోసం రాసుకున్న కథలో కొంత భాగం వినిపించాడు. వినగానే ఇంప్రెస్ అయిపోయిన అనిరుధ్ వెంటనే చొరవ తీసుకుని లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ మీటింగ్ జరిగేలా చూశాడు. విన్న తలైవర్ కూలీ బాగా నచ్చేసింది. పైగా ఆయన అప్పటికే ఖైదీ, మాస్టర్, లియో చూసి ఉండటంతో టేకింగ్ మీద ఎలాంటి అనుమానం లేదు. అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జైలర్ నిర్మాతలు సన్ పిక్చర్స్ లైన్ లోకి రావడం చకచకా జరిగిపోయాయి.
ఒకవేళ అనిరుధ్ కనక వెంటనే స్పందించకపోయి ఉంటే కూలీ ఇంకా ఆలస్యమయ్యేది. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు అతి తక్కువ స్పాన్ లోనే రజనీకాంత్ తో చేసే అదృష్టాన్ని దక్కించుకుంటున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్ తదితరులు పట్టుమని పది సినిమాలు చేసిన అనుభవం లేకుండానే సూపర్ స్టార్ కి కెమెరా యాక్షన్ చెప్పారు. రజని సైతం సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాబీ, గోపీచంద్ మలినేని లాంటి వాళ్ళు ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇవన్నీ పక్కనపెడితే కూలీ మేనియా చూస్తుంటే అరాచకం పదం చిన్నదే అనిపిస్తోంది.
This post was last modified on August 13, 2025 11:22 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…