న్యాచురల్ స్టార్ నానిని మాస్ లీగ్ లోకి తీసుకొచ్చిన దసరా దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల వేసుకున్న ముద్ర చిన్నది కాదు. రెండో సినిమా రిలీజ్ కాకుండానే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం నానితోనే ది ప్యారడైజ్ తీస్తున్న శ్రీకాంత్ ఇవాళో మేకింగ్ వీడియో వదిలాడు. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ లోని కీలకమైన జైలు ఎపిసోడ్ ని చిన్న మేకింగ్ వీడియో రూపంలో విడుదల చేశారు. వందలాది ఖైదీలు మారణాయుధాలతో దాడి చేయడానికి వస్తుండగా, రెండు జెల్లేసుకున్న నాని నల్లని దుస్తుల్లో కుర్చీలో కూర్చుని వాళ్ళను ఎదిరించేందుకు సిద్ధమయ్యే షాట్ ఇందులో ఉంది.
మొన్న విడుదల చేసిన థీమ్ పోస్టర్ సన్నివేశాన్నే ఇప్పుడు మనం చూసింది. శ్రీకాంత్ ఓదెల ఈసారి అంచనాలకు మించిన వయొలెన్స్ తో ది ప్యారడైజ్ రూపొందిస్తున్నాడు. అనౌన్స్ మెంట్ టీజర్ లోనే హీరో పాత్రను ల** కొడుకు అనిపించడం ద్వారా తన క్యారెక్టరైజేషన్స్ లో మొహమాటాలు ఉండవని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ గా చెప్పాడు. సో శాంపిలే అలా ఉంటే ఇక మెయిన్ కంటెంట్ గురించి ఊహించుకోవడం కష్టమే. జెడలు వేసుకుని సినిమా మొత్తం కనిపించే స్టార్ హీరో ఇప్పటిదాకా ఎవరూ లేరు. మొదటిసారి అలాంటి రిస్క్ తీసుకున్న నాని నమ్మకమంతా శ్రీకాంత్ ఓదెల ప్రతిభ మీదే.
వచ్చే ఏడాది మార్చి 26 విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్దితో తలపడనుంది. అయితే ఈ క్లాష్ పట్ల నాని టెన్షన్ గా లేడు. ఎందుకంటే గతంలో బాలీవుడ్ మూవీస్ గదర్, లగాన్ రెండూ ఒకే రోజు రిలీజై చరిత్ర సృష్టించి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అంతకు ముందు దిల్, ఘాయల్ కూడా ఇదే కోవలో ప్రత్యేకత సంపాదించుకున్నాయి. అలాంటిది పెద్దికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ది ప్యారడైజ్ నిర్మాతలు భావిస్తున్నారు. తల్లి కొడుకుల ఎమోషన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా భావిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్యారడైజ్ కి ప్రధాన ఆకర్షణ కానుంది.
This post was last modified on August 11, 2025 6:04 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…